Begin typing your search above and press return to search.
జగన్ కోరిక తీర్చిన బాబు
By: Tupaki Desk | 19 Aug 2016 10:54 AM GMTఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రత్యర్థి ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కోరికను నెరవేర్చారు! ఏంటి నిజంగానా అనుకుంటున్నారా? అవును నిజమే. 'జాతీయ మీడియాతో మాట్లాడని చంద్రబాబు తన భావాలను ఎలా చెప్తారు? ఢిల్లీలో ఒక మాట - ఇక్కడ మరోమాట. ప్రధాని లక్ష్యంగా చేసుకొని బాబు ప్రత్యేక హోదా గురించి ఎలా స్పందించగలరు?' ఇవే అంశాలు - ఆరోపణలు వైఎస్ జగన్ పదే పదే చేస్తున్న సంగతి తెలిసిందే. వీటికీ అన్నింటికీ చంద్రబాబు ఒకే సారి ఆన్సర్ చేశారు.
కృష్ణా పుష్కరాలు సాగుతున్న తీరును తెలుసుకునేందుకు ఢిల్లీ కేంద్రంగా పనిచేసే మీడియా ప్రతినిధులు పలువురు ఆంధ్రప్రదేశ్ కు విచ్చేశారు. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో పుష్కరాలు సాగుతున్న తీరును వారికి వివరించిన అనంతరం జాతీయ మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ కృష్ణా నది పండుగ చేసుకుంటున్నాం, రాజకీయాలు మాట్లాడనంటూనే.. కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాజ్యసభ సాక్షిగా చెప్పారని, ప్రధాని ఇచ్చిన హామీకే దిక్కులేక పోతే ఎలా? అని సిఎం ప్రశ్నించారు. విభజన చట్టంలో పేర్కొన్న ఐదు ప్రధాన హామీలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఆర్థిక లోటు - ప్రత్యేక హాదా పోలవరం - రైల్వేజోన్ - వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై జాప్యం చేయరాదన్నారు. కేంద్రం గురువారం ప్రకటించిన నిధులపై కూడా స్పష్టత లేదని విమర్శించారు. మరిన్ని నిధులు కేటాయించాలన్నారు. రాయలసీమ - ఉత్తరాంధ్రలోని ఏడు జిల్లాలు వెనుకబడి ఉన్నాయని వాటికోసం బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని చెప్పి రూ.350 కోట్లు విడుదల చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.350 కోట్లతో ఏడు జిల్లాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయని ప్రశ్నించారు. విభజన చట్టంలో పేర్కొన్నట్లు రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన విషయంలో కేంద్రం చొరవ చూపడం లేదన్నారు. ఉన్నత విద్యా మండలి ఆస్థుల పంపకం విషయంలో సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా దాని అమలు గురించీ పట్టించు కోవడం లేదన్నారు. కేంద్రం ఇంతవరకు రాష్ట్రానికి ఇచ్చింది నామమాత్రమేనని, ఇంకా ఏమిస్తుందనే దానిపై స్పష్టత ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ చేతిలో దగాపడ్డ ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం ఉదారంగా వ్యవహరించాలని కోరారు. పోలవరం పూర్తయితే ఇతర రాష్ట్రాలకు సైతం ఆంధ్రప్రదేశ్ నుంచి నీరివ్వగలమన్నారు. కేంద్రం నిధులు విడుదల చేయక పోవడంపై ఆంధ్రుల భావోద్వేగాలను ఢిల్లీ పాలకులకు తెలియచేయాలని జాతీయ మీడియాను చంద్రబాబు కోరారు.
ఏకంగా జాతీయ మీడియాతోనే ప్రధానమంత్రిని టార్గెట్ చేసేలా వ్యవహరించడం ద్వారా ఏపీకి ఆర్థిక సహాయం విషయంలో చంద్రబాబు తన దూకుడును చాటుకున్నారని చర్చ సాగుతోంది. పైగా ఢిల్లీ కేంద్రంగా పనిచేసే జర్నలిస్టులతో ఏపీ సమస్యలు ఏకరువు పెట్టడం ద్వారా ఈ విషయాలన్నీ హస్తినాలో చర్చ జరగాలనేది బాబు మదిలోని భావనగా చెప్తున్నారు. మొత్తంగా ఇటు ఏపీ ప్రయోజనాలు నెరవేరుస్తూనే అటు ప్రతిపక్ష నేత జగన్ కోరికను కూడా తీర్చినట్లయిందని అంటున్నారు.