Begin typing your search above and press return to search.

రోజాను ఇలా టార్గెట్ చేయ‌డం ఏంటి బాబు?

By:  Tupaki Desk   |   7 Nov 2017 5:51 AM GMT
రోజాను ఇలా టార్గెట్ చేయ‌డం ఏంటి బాబు?
X
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్‌బ్రాండ్ నాయ‌కురాలు, చిత్తూరు జిల్లా న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా అధికార తెలుగుదేశం పార్టీపై సూటిగా, ఘాటుగా స్పందించే తీరు అంద‌రికీ సుప‌రిచిత‌మే. సంద‌ర్భం ఏదైనా రోజా స్పందించారంటే...అధికార పార్టీ ఇరుకున ప‌డాల్సిందే. రోజా దాటికి త‌ట్టుకోలేక‌నే ఆమెపై అసెంబ్లీలో స‌స్పెన్ష‌న్ వేటు వేయించార‌నే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇలా పంటికింద రాయిలా మారిన రోజాకు చెక్ పెట్టేందుకు ఏకంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు రంగంలోకి దిగార‌ని అంటున్నారు. నిత్యం బాబుపై విమర్శలు గుప్పిస్తూ కంట్లో నలుసులా మారిన రోజాకు పోటీగా సినీ రంగానికే చెందిన వాణీ విశ్వనాథ్‌ ను తీసుకురావడం ద్వారా, రోజాను కేవలం తన నియోజకవర్గానికే పరిమితం చేసే వ్యూహానికి టీడీపీ నాయకత్వం తెరలేపింది.

వాస్త‌వానికి వాణివిశ్వ‌నాథ్‌ ను తెలుగుదేశంలోకి తీసుకువ‌చ్చేందుకు చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి ఈ మేర‌కు తుది చ‌ర్చ‌లు జ‌రిపి ఆమెను పార్టీలోకి తీసుకువస్తున్నారని స‌మాచారం. బాబును కలిసేందుకు విజయవాడ వచ్చిన వాణీ విశ్వనాథ్ సోమవారం మీడియాతో మాట్లాడారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరనున్నానని, మంగళవారం టీడీపీ అధినేత - ఏపీ సీఎం చంద్ర‌బాబును కలుస్తానని ప్రకటించారు. ‘నిజానికి నాకు రోజా పోటీ అనుకోవడం లేదు. పార్టీ ఆదేశిస్తే రోజాపై పోటీకి సిద్ధం. నేను మలయాళీ అయినా తెలుగువాళ్లంటే ఇష్టం. నా సినిమాలు ఎక్కువగా ఆదరించారు. రాష్ట్రంలో బాబు పరిపాలన చాలా బాగుంది’ అని కితాబు ఇచ్చారు.

వాణివిశ్వ‌నాథ్‌ ను ఎంట్రీ చేయించేందుకు రెండు కార‌ణాలు ఉన్నాయ‌ని అంటున్నారు. చాలాకాలం నుంచి రోజా తన నగరి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలను సొమ్ము చేసుకునేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. అదే స‌మ‌యంలో పార్టీకి మ‌రింత సినీ గ్లామర్ అద్ద‌డం - ముఖ్యంగా రోజాను ఎదుర్కునే స్థాయిలో డైన‌మిజం ఉన్న నాయ‌కురాలిని ముందుకు తేవ‌డం కుదురుతుంద‌ని చెప్తున్నారు.