Begin typing your search above and press return to search.

ఒక్క విజిట్ ప్లీజ్ అంటున్న బాబు

By:  Tupaki Desk   |   22 Sept 2015 9:52 AM IST
ఒక్క విజిట్ ప్లీజ్ అంటున్న బాబు
X
ఏపీని అగ్రస్థానంలో నిలిపేందుకు తపిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తన తాజా సింగపూర్ పర్యటనలో పారిశ్రామికవేత్తల్ని.. పెట్టుబడిదారుల్ని ఆకట్టుకునేందుకు ఆసక్తికరమైన వ్యాఖ్య చేస్తున్నారు.

మిగిలిన వారి మాదిరి కాకుండా.. పెట్టుబడులు పెట్టాలంటూనే.. అంతకు ముందు ఒక్కసారి ఏపీకి రావాలని.. అక్కడి పరిస్థితులు చూడాలని.. అవకాశాల్ని పరిశీలించాలని.. ఆ తర్వాత ఎలాంటి నిర్ణయమైనా తీసుకోండని కోరుతున్నారు. విదేశీ పెట్టుబడుల్ని ప్రవాహంలా పారించాలని తపిస్తున్న చంద్రబాబు మాటలు వింటే.. గతంలో వచ్చిన ఒక సినిమాలోని డైలాగ్ గుర్తుకు రాగలదు.

సినిమా అవకాశాల కోసం విపరీతంగా తపించే హీరో.. తనకు ఒక్కటంటే.. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరటం.. కనిపించిన డైరెక్టర్లను సార్.. ఒక్కటి సార్.. ఒక్కటంటే ఒక్క ఛాన్స్ ఇవ్వమని ప్రాధేయపడిన చందంగా.. ఒక్క విజిట్.. ఏపీకి ఒక్క విజిట్ చేయాలని పారిశ్రామికవేత్తల్ని ఏపీ ముఖ్యమంత్రి కోరటం కనిపిస్తుంది.

మరి.. చంద్రబాబు కోరినట్లుగా ఏపీకి విజిట్ కు వచ్చే పారిశ్రామికవేత్తలు ఎందరో చూడాలి. ఏమైనా.. ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టకుండా తనకున్న ప్రతి అవకాశాన్ని వదిలిపెట్టకుండా.. పెట్టుబడుల కోసం విపరీతంగా ప్రయాసపడుతున్న బాబు ప్రయత్నాలకు.. పారిశ్రామికవేత్తలు ఏ స్థాయిలో స్పందిస్తారో చూడాలి.