Begin typing your search above and press return to search.
రండి.. వచ్చి చూడండి.. కుళ్లుకోండి
By: Tupaki Desk | 11 Oct 2015 9:28 AM GMTనవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇంటికి వెళ్లి మరీ స్వయంగా పిలుస్తారట. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని శంకుస్థాపనకు ఆహ్వానిస్తారట. ఈ విషయాలను స్వయంగా చంద్రబాబు నాయుడే వెల్లడించారు. ఆయన ఎంతో మర్యాదపూర్వకంగా సంప్రదాయబద్ధంగా ఆ మాటలు చెప్పినా.. పలువురు సీమాంధ్రులు మాత్రం రండి.. వచ్చి చూడండి.. కుళ్లుకోండి అని కేసీఆర్ - సోనియాలను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నారు. అంతేనా.. చంద్రబాబు నాయుడు కేసీఆర్ తోపాటు సోనియాను కూడా స్వయంగా ఆహ్వానిస్తే ఇంకా బాగుంటుందేమోనని సూచిస్తున్నారు.
హైదరాబాద్ ను తెలంగాణకు ఇచ్చేసి ఆంధ్రప్రదేశ్ ను రాజధాని లేకుండా సోనియా గాంధీ విభజించిన సంగతి తెలిసిందే. ఆస్తులన్నీ తెలంగాణకు కట్టబెట్టి అప్పులను మాత్రం సీమాంధ్రకు మిగిల్చింది. అటువంటి పరిస్థితుల్లో నవ్యాంధ్రకు రాజధానిని నిర్మించుకోవడం అసాధ్యమనేది రాజకీయ విశ్లేషకుల భావన. కానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ స్థాయి రాజధానికి శ్రీకారం చుట్టారు. దానికి విజయ దశమి సందర్భంగా శంకుస్థాపన కూడా చేస్తున్నారు. హైదరాబాద్ ను తలదన్నేలా అంతర్జాతీయ స్థాయిలో అమరావతి ఉంటుందని, మూడేళ్ల తర్వాత ప్రపంచంలోని అద్భుత నగరాల్లో అమరావతి ఒకటి అవుతుందని కూడా ఘంటాపథంగా తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాజధాని లేకుండా విభజనకు కారణమైన కేసీఆర్ ను; రాజధాని లేకుండా విభజన చేసిన సోనియాను పిలవడం వారిని చిన్నబుచ్చుకునేలా చేయడమేనని విశ్లేషకులు అంటున్నారు.
అదేసమయంలో, చంద్రబాబు నాయుడు పిలిచినా.. నవ్యాంధ్ర నడిబొడ్డున జరుగుతున్న శంకుస్థాపనకు కేసీఆర్ వస్తారా? ఆయన వచ్చినా పెద్ద సంచలనం ఏమీ ఉండదు కానీ.. సోనియా గాంధీ వస్తుందా? వస్తే ఏముఖం పెట్టుకుని వస్తుంది? వంటి ప్రశ్నలు సీమాంధ్రుల నుంచి ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.