Begin typing your search above and press return to search.
మరో కాంగ్రెస్ నేతకు టీడీపీ టికెట్ ఆఫర్..!
By: Tupaki Desk | 9 March 2019 5:02 AM GMTకాంగ్రెస్ పార్టీ నుంచి కూడా నేతలను తెచ్చుకొంటూ ఉన్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు! కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయిందని.. గత ఎన్నికల సమయంలోనే అది జరిగిందని అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కొద్దో గొప్పో మిగిలిన నేతలు కూడా.. వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీల్లోకి వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీ అలా ఎడారి అయిపోయింది. అలాంటి ఎడారి లో కనుమరుగు అయిన నేతలను కూడా చంద్రబాబు నాయుడు ఇప్పుడు వదలకపోవడం విశేషం. ఇప్పటికే ఉత్తరాంధ్రలో ఒకరిద్దరిని, కోస్తాలో మరొక నేతను కాంగ్రెస్ నుంచి తెచ్చుకున్నారు బాబు. వారికి టికెట్లు ఖరారు అయినట్టే అని తెలుస్తూ ఉంది.
అందుకు సంబంధించి రచ్చలు జరుగుతున్నాయి కూడా. కనిగిరి టికెట్ ను కాంగ్రెస్ నేత ముక్కు ఉగ్రనరసింహారెడ్డికి కేటాయించే విషయంలో తర్జనభర్జనలు సాగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు ఆ పంచాయితీని వాయిదా వేశారు.
ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు అనంతపురం జిల్లా శింగనమల అసెంబ్లీ సెగ్మెంట్ టికెట్ విషయంలో కూడా కాంగ్రెస్ లో ఉన్న ఒక నేతకు చంద్రబాబు నాయుడు గాలం వేస్తున్నారట. ఆయన ఆ గాలానికి పడతారా లేదా అనేది ఆసక్తిదాయకంగా మారిందిప్పుడు. బాబు పార్టీలోకి రారమ్మంటున్నది మరెవరినో కాదు.. మాజీ మంత్రి శైలజానాథ్ ను అని సమాచారం. ఎస్సీ రిజర్వ్డ్ సీటు అయిన శింగనమలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం విషయంలో ప్రతిష్టంభన నెలకొంది.
అక్కడ టీడీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. అయితే ఆమెపై వ్యతిరేకత ఉందని తేల్చారు. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే కుటుంబంలోనే టికెట్ పోరు సాగుతూ ఉంది. ఆ మహిళా ఎమ్మెల్యే యామినిబాల సోదరుడు కూడా టికెట్ ఆశిస్తూ ఉన్నారు. ఆమె తల్లి శమంతకమణి మద్దతు కొడుకునే ఉందని సమాచారం. దీంతో వారి కుటుంబంలో ఇందుకు సంబంధించి పోరాటం సాగుతూ ఉంది.
ఇలాంటి నేపథ్యంలో ప్రత్యామ్నాయాల గురించి బాబు ఆలోచిస్తున్నారట, అందులో భాగంగా ఒక ప్రభుత్వ ఉద్యోగిణిని , ఈ సీటు నుంచి గతంలో కాంగ్రెస్ తరఫున నెగ్గిన శైలజానాథ్ ను పరిగణనలోకి తీసుకున్నారట బాబు. వీరందరిలోనూ మొదటి ఛాయిస్ అయితే శైలజానాథేనట. ఆయన ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ లోనే ఉన్నారు, కొన్నాళ్ల కిందటే ఆయనకు ఈ ఆఫర్ వెళ్లిందట.
దీంతో శైలజానాథ్ స్థానికంగా సర్వేను చేయించుకున్నారని సమాచారం. తెలుగుదేశం పార్టీ తరఫున తను పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందా.. లేదా.. అనే అంశాల గురించి ఆ అధ్యయనం చేయించుకున్నారట. అందులో ఫలితాలు తేడా కొట్టడంతో.. ఇప్పుడు టీడీపీ టికెట్ ఆఫర్ ఇచ్చినా ఆయన నో చెబుతున్నారట. శింగనమల అయితే వద్దని.. జిల్లాలోనే మరో ఎస్సీ రిజర్వ్డ్ సీటు అయితే పోటీకి ఆసక్తి ఉందని శైలజనాథ్ బాబుకు తన ఉద్దేశాన్ని తెలియజేశారట!