Begin typing your search above and press return to search.
ఆ బాబు టీడీపీలోకి రావాలంటూ చంద్రబాబు ఆరాటం
By: Tupaki Desk | 2 Jun 2018 1:08 PM GMTఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవనిర్మాణ దీక్ష సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘకాలంగా చర్చల్లో నలుగుతున్న...రాజకీయ వర్గాలు అనుమానిస్తున్న అంశాన్ని ఆయన నిజం చేశారు. విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర నిర్వహించిన నవనిర్మాణ దీక్షా వేదిక సాక్షిగా చంద్రబాబు రాజకీయ కామెంట్లు చేశారు. ఇంతకీ విషయం ఏంటంటే...ఏపీఎన్జీవో నేత అశోక్ బాబుకు చంద్రబాబు ఊహించని ఆఫర్ ఇస్తూ రాజకీయాల్లోకి రావాలని కోరారు. పరోక్షంగా తమ పార్టీలోకి రావాలని సూచించారు.
నవనిర్మాణ దీక్ష సందర్భంగా ప్రసంగిస్తున్న చంద్రబాబు వేదికపైనే అశోక్ బాబును ఆకాశానికెత్తేశారు. ప్రజాసేవ కోసం రాజకీయాల్లో రావాలంటూ ఆహ్వానించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఏపీ ఎన్జీఓ నేత అశోక్ బాబు కీలక పాత్ర వహించారని ప్రశంసించిన చంద్రబాబు వచ్చే ఏడాది ఏడాదిలోఅశోక్ బాబు రిటైరవుతున్నారని… కాబట్టి రాజకీయాల్లోకి రమ్మని ఆయనను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్యోగులు చేసిన పోరాటం ఎవరూ మరువలేరని.. అదే నిబద్ధతతో ప్రజాజీవితంలోకి అడుగుపెట్టాలని అశోక్ బాబుకు సూచించారు. ఆయన ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉంటామంటూ పరోక్షంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. సభా వేదికగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో వచ్చే ఎన్నికల్లో అశోక్ బాబు కు టీడీపీ నుంచి టికెట్ ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది.
సమైక్యాంధ్ర ఉద్యమంలో తెరపైకి వచ్చిన అశోక్ బాబు ఆ తర్వాత ప్రభుత్వం చేపట్టే అనేక కార్యక్రమాల్లో ముఖ్యమంత్రికి అండగా నిలిచారు. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ కు అనుకూలంగా ప్రచారం చేసి..మరోసారి ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించారు. దీంతో నవ నిర్మాణ దీక్ష వేదికపై అశోక్ బాబును పొగడ్తలతో ముంచెత్తిన చంద్రబాబు ప్రజాసేవలోకి రావాలంటూ బంపర్ ఆఫర్ ఇఛ్చారు.