Begin typing your search above and press return to search.
టీడీపీలోకి వైసీపీ అగ్రనేతలు
By: Tupaki Desk | 7 Dec 2015 7:17 AM GMTతెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో చేరికల జోరును కొనసాగిస్తోంది. పార్టీ బలోపేతానికి, సంస్థాగతంగా పార్టీని పూర్తి స్థాయిలో పునర్ నిర్మించేందుకు ఎవరూ వచ్చినా ఆహ్వానించాలని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు పలుమార్లు ప్రకటించడమే కాకుండా... అందులో భాగంగానే నెల్లూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆనం బ్రదర్స్ ను పార్టీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆనం సోదరులను పార్టీలోకి తీసుకునేందుకు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్లు కొందరు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. వారికి నచ్చజెప్పి ఒప్పించి ఆనం సోదరులను పార్టీలోకి చంద్రబాబు చేర్చుకున్నారు. ఇదే క్రమంలో మరో ఇద్దరు వైసీపీ నేతలకు పచ్చకండువా కప్పేందుకు బాబు రెడీ అయిపోతున్నారు.
విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ - కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెదేపాలో చేరడం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. ఈ ఇరువురు నేతలను పార్టీలోకి తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు సంకల్పించినట్లు ప్రచారం జరుగుతోంది. కొణతాల రాకను మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆయనను పార్టీలోకి తీసుకునే అంశంపై చంద్రబాబు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. నర్సీపట్నంలోని ఓ డిగ్రీ కళాశాల కళాశాల కార్యక్రమానికి ఆహ్వానం పేరుతో చంద్రబాబును కొణతాల కలిసిన సమయంలోనే పార్టీలో చేరే అంశంపై ఇరువురు చర్చించుకున్నట్లు తెలుగుదేశం పార్టీలో ప్రచారం జరుగుతోంది.
విశాఖ జిల్లాకు చెందిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కొణతాలతో పాటు దాడిని కూడా పార్టీలోకి తీసుకోవాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అయితే పార్టీని వీడే సమయంలో దాడి వీరభద్రరావు చంద్రబాబుపై తీవ్రమైన ఆరోపణలు చేశారని.. వైసీపీలో చేరిన తర్వాత కూడా వాటిని కొనసాగించారని అటువంటి నేతను తిరిగి పార్టీలోకి ఎలా తీసుకుంటారని ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పలువురు పార్టీ సీనియర్లు చంద్రబాబును ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. దాడిని పార్టీలోకి తీసుకునే అంశం అనుమానమేనని కొణతాలకు మాత్రం దాదాపు లైన్ క్లియర్ అయిందని తెలుస్తోంది.
కొణతాలను పార్టీలోకి చేర్చుకునే అంశానికి సంబంధించి నేతల మధ్య గొడవలు తీర్చే పనిని చంద్రబాబు తెదేపా ఏపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావుకు అప్పగించినట్లు చెబుతున్నారు. జిల్లాకు చెందిన మంత్రులు, పార్టీ నేతలను కూర్చోబెట్టి వారితో మంతనాలు జరపాలని అందరినీ ఒప్పించి, అంగీకరింపచేసి కొణతాల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు కళా వెంకట్రావును ఆదేశించినట్లు చెబుతున్నారు.
మరోవైపు కడప జిల్లాకు చెందిన వైకాపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆదినారాయణ రెడ్డి విషయంలోనూ జిల్లాకు చెందిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు.దీంతో ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి తీసుకునే అంశం పెండింగ్‌లో పడింది. రాయలసీమలో ముఖ్యంగా కడప జిల్లాలో వైసీపీని దెబ్బతీసేందుకు ఆదినారాయణ రెడ్డి తరహాలో మరికొంతమంది నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని బాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా వైసీపీ టార్గెట్‌గా టీడీపీ ముందుకుపోతున్నట్లు స్పష్టం అవుతోంది.