Begin typing your search above and press return to search.

అర్ధరాత్రి రాజకీయం.. బాబుదేనా.?

By:  Tupaki Desk   |   14 Nov 2018 7:48 AM GMT
అర్ధరాత్రి రాజకీయం.. బాబుదేనా.?
X
బాబు మార్క్ పాలి‘ట్రిక్స్’ కాంగ్రెస్ కు కూడా అంటాయని విమర్శకులు ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు. అసమ్మతి చెలరేగే అవకాశం ఉన్నా.. అనర్ధం జరుగుతుందని అనుకున్న చంద్రబాబు అర్ధరాత్రుళ్లు హడావుడిగా నిర్ణయాలు తీసుకుంటారని పొలిటికల్ సర్కిల్స్ లో ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. అలా అర్ధరాత్రి సంచలన నిర్ణయాలు తీసుకొని.. తెల్లారేలోగా అంతా సర్దుబాటు చేసుకునేలా బాబు వ్యూహ రచన చేస్తుంటాడట.. దీనివల్ల అసమ్మతి - అనర్ధాలను చాలా తగ్గించుకుంటాడని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు.

ఇప్పుడు ఇదే ఫార్ములా కాంగ్రెస్ కు వంటపట్టింది. చంద్రబాబు మహాకూటమితో ఇలా కలిసాడో లేదో కాంగ్రెసోళ్లపై బాబు మార్క్ పాలిట్రిక్స్ పడిపోయాయి. కాంగ్రెస్ కూడా సరిగ్గా బాబు లాగానే సీట్లను అర్ధరాత్రి ప్రకటించేసింది.

అభ్యర్థుల జాబితా విడుదలలో కాంగ్రెస్ ఇంత జాప్యాన్ని ఎప్పుడూ చేయలేదు. ఇంత ఆలస్యంగా స్పందించింది లేదు. ఢిల్లీ నుంచి వచ్చే సీల్డ్ కవర్ లిస్ట్ లు అయినా సవ్యంగానే విడుదల చేసేవారు. కానీ ఈసారి మాత్రం తెలంగాణ అభ్యర్థుల జాబితా కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సిన పరిస్థితిని కాంగ్రెస్ కల్పించింది. గడిచిన సోమవారం అర్ధరాత్రి సీక్రెట్ గా కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.

నాన్చి నాన్చి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే సమయంలో కాంగ్రెస్ 65మంది అభ్యర్థుల జాబితా బయటకు వచ్చింది. టీడీపీ కూడా 9మందితో తొలి జాబితాను విడుదల చేసింది. తెల్లవారేసరికి అంతా సర్దుబాటు అయ్యేలా కాంగ్రెస్ పెద్దలు చూసుకున్నాడు. కానీ కాంగ్రెస్ అధిష్టానం తయారు చేసిన లిస్ట్ కూడా అమరావతికి వెళ్లివచ్చిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఏదీ నిజమో.. ఏదీ అబద్దమో కానీ.. బాబు సహవాసంలో కాంగ్రెస్ కూడా అలానే తయారైందని రాజకీయవిశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు.