Begin typing your search above and press return to search.
ట్రంప్ కూతురు హైదరాబాద్ వచ్చేది బాబు వల్లే!
By: Tupaki Desk | 17 Aug 2017 1:38 PM GMTప్రచారానికి ఓ హద్దంటూ ఉండాలి. కానీ ఏ హద్దు లేకుండా... ప్రచారం చేసుకోవడంతో టాప్ లో ఉండేది ఎవరంటే సహజంగా టీడీపీ నేతల పేర్లు వినిపిస్తుంటాయని పొలిటికల్ సర్కిల్ లో ఓ టాక్ ఉంది. తమ నాయకుడు చంద్రబాబుకు దక్కుతున్న ఆదరణను ఓర్చుకోలేని వాళ్లే ఇలా దుష్ప్రచారానికి దిగుతారని తెలుగతమ్ముళ్లు అంటుంటారు. అయితే ఇలాంటి సెటైర్లు నిజమనిపించే సమాచారం ఒకటి తాజాగా తెరమీదకు వచ్చింది. అదే హైదరాబాద్ డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ రావడం వెనుక టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉన్నారనే ప్రచారం.
ప్రపంచ పెట్టుబడిదారుల సమాఖ్య సమావేశం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయ - ఆయన సలహాదారు ఇవాంక ట్రంప్ మొట్టమొదటి సారి భారతదేశానికి వస్తున్నారు. ఈ సదస్సు సాగుతున్న హైదరాబాద్ కు ఇవాంక ట్రంప్ రావడం ప్రత్యేక ఆకర్షణను సంతరించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం కారణంగా ఇవాంక ట్రంప్ ఇండియాకు వచ్చేందుకు, ఈ సదస్సులో భాగస్వామ్యం పంచుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ టూర్ కారణంగా హైదరాబాద్ గుర్తింపు మరోమారు మారుపోగిపోనుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేస్తోంది.
అయితే హైదరాబాద్ కు ఏ మాత్రం సానుకూల పేరు వచ్చినా తమ ఖాతాలోనే వేసుకోవడంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఏ మాత్రం మొహమాటం ప్రదర్శించరనే విషయం తెలిసిందే. సేమ్ ఇదే ట్రెండ్ ను తాజా సదస్సులో ఫాలో అయ్యారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మీడియాతో మాట్లాడుతూ ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ వచ్చేందుకు అంగీకరించడం వెనుక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక కృషి ఉందన్నారు. హైదరాబాద్ ను ప్రపంచపటంలో పెట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన కృషి వల్లే నగరానికి ఇంత గుర్తింపు వచ్చిందని పేర్కొంటూ అందుకే ఇవాంక ట్రంప్ హైదరాబాద్ వస్తున్నారని తెలిపారు.