Begin typing your search above and press return to search.
జేసీ ద్వారా చంద్రబాబు మైండ్ గేమ్
By: Tupaki Desk | 10 April 2018 5:04 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఇప్పటికీ... ప్రత్యేక ప్యాకేజీ అనే నిధుల దందాకే మొగ్గు చూపుతున్నారా? ప్రజల కోసం ఏదో ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నట్లుగా బిల్డప్ ఇవ్వడమే తప్ప.. కేంద్రం తాము రెడీ ఇస్తాం అని చెబుతున్న ప్రత్యేకప్యాకేజీని తీసుకుని అయిన కాడికి సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశం మాత్రమే చంద్రబునాయుడులో ఉందా? అంటే.. రాజకీయ వర్గాల నుంచి మాత్రం అవుననే సమాధానమే వస్తోంది. దానికి తగ్గట్లుగానే ఆయన ప్రజలతో మళ్లీ మైండ్ గేమ్ ప్రారంభించారనే వాదన కొత్తగా వినిపిస్తోంది. ఈసారి తాను ప్రజల్తో మైండ్ గేమ్ ఆడడానికి ఆయన జేసీ దివాకర రెడ్డిని వాడుకుంటున్నారని అంతా అనుకుంటున్నారు.
చంద్రబాబునాయుడు నలభయ్యేళ్ల సీనియారిటీ ఉన్న రాజకీయ నాయకుడు. ఆయన వద్ద చాలా ఐడియాలు ఉంటాయి. ప్రధానంగా అవతలి వాళ్లలో అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి.. తనకు చెడ్డ పేరు రాకుండా... తను ఏం చేసినా మంచే అని అంతా అనుకునేలా.. మైండ్ గేమ్ నడిపించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ప్రజల్లో తనకు నచ్చిన అభిప్రాయాలను నాటి, వాటిని పెంచడంలో ఆయన దిట్ట.
ఇప్పుడు హోదా అక్కర్లేదు.. ప్యాకేజీ ఇస్తే చాలు... అని ప్రజలంతా అనుకునేలా ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. హోదా అనేది రావడం అసాధ్యం అని.. దానికి సమానంగా ప్రత్యేకప్యాకేజీ ఇచ్చినా తాను ప్రజల్ని ఒప్పిస్తానని అన్నారు. జేసీ మాటల పట్ల ప్రజాస్పందనను గమనించడానికి చంద్రబాబు వెనక ఉండి ఇలాంటి మైండ్ గేమ్ నడిపిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అంటే జేసీ మాటల పట్ల ప్రజా స్పందన పెద్దగా వ్యతిరేకత రాకపోతే.. రెండ్రోజుల్లో చంద్రబాబు మళ్లీ ప్రత్యేకప్యాకేజీ అయినా తీసేసుకుందాం అని మాట మార్చి, కొత్త పాట మొదలెడతారన్నమాట.