Begin typing your search above and press return to search.
రాజధాని మేటర్ లోకి పవన్.. చంద్రబాబు స్కెచ్చేనా?
By: Tupaki Desk | 25 Aug 2019 6:56 AM GMTఉన్నట్టుండి రాజధాని మేటర్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. అమరావతి ప్రాంతంలోనే రాజధాని ఉండాలనేది పవన్ కల్యాణ్ డిమాండ్. చాలా రకాల పొలిటికల్ డెవలప్ మెంట్స్ ఉన్నా వాటి గురించి పవన్ కల్యాణ్ స్పందించడం లేదు. ఈ మధ్య తన అన్న చిరంజీవి బర్త్ డేతోనూ - ఆయన సినిమా గురించి ప్రచారంతోనూ పవన్ కల్యాణ్ బిజీగా గడిపారు.
అయితే ఉన్నట్టుండి పవన్ కల్యాణ్ రాజధాని అంశం గురించి మాట్లాడారు. అంతే కాదట.. త్వరలోనే పవన్ కల్యాణ్ రాజధాని ప్రాంతంలో పర్యటించబోతున్నారట కూడా.మూడు రోజుల పాటు పవన్ కల్యాణ్ అక్కడ పర్యటిస్తారట. రాజధాని అక్కడే ఉండాలని, అక్కడి రైతులు త్యాగాలు చేశారని పవన్ అంటున్నారు.
మరి ఉన్నట్టుండి ఈ మ్యాటర్ లోకి పవన్ కల్యాణ్ ఎంట్రీ వెనుక కథేంటి? అంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేరే వినిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడి స్కెచ్ మేరకే పవన్ కల్యాణ్ రాజధాని మేటర్ లోకి ఇన్ వాల్వ్ అవుతూ ఉన్నారనే మాట వినిపిస్తూ ఉంది. రాజధాని అక్కడ నుంచి తరలడం చంద్రబాబుకు సుతారమూ ఇష్టం లేని అంశం. అంతే కాదు.. రాజధాని విషయంలో వికేంద్రీకరణ కూడా చంద్రబాబు నాయుడుకు ఇష్టం లేదనేది బహిరంగ సత్యం.. అదే జరిగితే ఆ ప్రాంతంలో భారీగా భూములు కొనుగోలు చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్లు నష్టపోతారు.
అందుకే ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెడుతూ ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే తెలుగుదేశం నేతల గగ్గోలు మొదలైంది. ఇప్పుడు దానికి తోడు పవన్ కల్యాణ్ కూడా రంగం దిగుతూ ఉన్నారని, అక్కడ హైప్ తగ్గిపోకుండా చూసేందుకు, భూములు విలువ తగ్గకుండా చూసేందుకు వీరంతా ఉమ్మడి ప్రయత్నం సాగిస్తూ ఉన్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉండటం గమనార్హం!