Begin typing your search above and press return to search.

సుహాసినికి థ్రెట్ చంద్ర‌బాబే !

By:  Tupaki Desk   |   29 Nov 2018 12:32 PM GMT
సుహాసినికి థ్రెట్ చంద్ర‌బాబే !
X
మీరు భ‌లే విచిత్రంగా మాట్లాడుతున్నారే అనుకుంటున్నారా? అదే మ‌రి. కూక‌ట్ ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో పోటీచేస్తున్న ప్ర‌జా కూట‌మి అభ్య‌ర్థి నంద‌మూరి సుహాసినికి పెద్ద చిక్కొచ్చి ప‌డింది. చంద్ర‌బాబుపై ఏపీ ప్ర‌జ‌ల్లోని కోపం.. సుహాసినిపై ప‌డుతోంది. అక్క‌డికి ఇక్క‌డికి ఏం సంబంధం అనుకుంటున్నారేమో. ఉంది సంబంధం ఉంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవ‌రిని అయినా అడగండి... ఆంధ్రులు హైద‌రాబాదులో ఎక్క‌డ ఎక్కువ ఉంటారు? అని... అంద‌రి స‌మాధానం కూక‌ట్‌ ప‌ల్లే. ఆమెను అక్క‌డ అభ్య‌ర్థిగా నిల‌ప‌డానికి కార‌ణం కూడా అదే. కానీ ఇపుడు ఆమెకు న‌ష్టం చేయ‌బోతున్న కార‌ణం కూడా అదే. కూక‌ట్ పల్లి నియోజ‌క‌వ‌ర్గంలో క‌మ్మ ఓట్లు 15 వేలు దాట‌వ‌ట‌. ఇవ‌న్నీ గంప‌గుత్త‌గా సుహాసినికి ప‌డినా... కాపు - రెడ్ల ఓట్లు ఆమెకు దెబ్బేస్తాయంటున్నారు. అక్క‌డ కాపులవి 64 వేలు ఓట్లున్నాయి. రెడ్ల‌వి 22 వేలు ఓట్లు ఉన్నాయి. వీరి ఉద్దేశం సుహాసినిని ఓడించాల‌ని కాదు - టీఆర్ ఎస్‌ ను గెలిపించాల‌నీ కాదు... చంద్ర‌బాబును ఓడించాల‌ని. ఎందుకంటే తెలంగాణ‌లో ప్ర‌జా కూట‌మి అధికారంలోకి వ‌స్తే ప్ర‌స్తుతం బ‌ల‌హీన ప‌డిన చంద్ర‌బాబు మ‌ళ్లీ బ‌ల‌ప‌డ‌తాడు. అది జ‌రిగితే త‌మ అభిమాన నేత‌కు న‌ష్ట‌మ‌ని జ‌గ‌న్ సామాజిక వ‌ర్గం భావిస్తోంది. ప‌వ‌న్ సామాజిక వ‌ర్గం కూడా దాదాపు అదే ఫీలింగ్‌ తో ఉంది. తెలంగాణ‌లో చంద్ర‌బాబును ఓడిస్తే ఆంధ్ర‌లో ఓడించ‌డం న‌ల్లేరు మీద న‌డ‌కే అన్న‌ది వారి భావ‌న‌. అందుకే వారంతా ఏక‌మై స‌మావేశాలు పెట్టుకుని మ‌రీ టీఆర్ ఎస్‌ కు మ‌ద్ద‌తు ఇస్తున్నారు.

ఇక సుహాసినికి మ‌రో భారీ థ్రెట్ ముస్లింలు. ఇక్క‌డ వారు 64 వేల ఓట్ల‌తో మెజార్టీగా ఉన్నారు. అయితే, మ‌జ్లిస్ పార్టీ బ‌హిరంగంగా టీఆర్ ఎస్‌ కు మ‌ద్ద‌తు ఇచ్చింది. ఎంఐఎం లేని చోట్ల టీఆర్ ఎస్‌ కు ఓటేయ‌మ‌ని అస‌ద్ పిలుపునిచ్చారు. ఈ నేప‌థ్యంలో ఈ ముస్లిం ఓట్ల‌లో మెజారిటీ ఓట్లు కేసీఆర్‌ కు ప‌డే అవ‌కాశం ఉంది. ఈ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో అన‌వ‌స‌రంగా త‌న ప్ర‌మేయం లేకుండానే సుహాసిని ఓడిపోతుందేమో అని విశ్లేష‌కులు వ్యాఖ్యానిస్తున్నారు.