Begin typing your search above and press return to search.
మీరు కలవాలె.... వారు గెలవాలె..
By: Tupaki Desk | 11 Nov 2018 8:43 AM GMTఇద్దరు కలిసి మిత్రుల్లయ్యారంటే... మూడు మనిషికి వేడుక. కాని రాజకీయ పార్టీల్లో మాత్రం ఇది పూర్తి విరుద్ధం. రెండు పార్టీలు కలిస్తే మూడో పార్టీకి వేడుక. ఇదేమిటీ అనుకుంటున్నారా... అవును నిజం. తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని చూస్తే ఇది నిజమనిపిస్తుంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు - ఆపధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమర శంఖం పూరించడంతోనే ఇది నిజమైంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఏకం కావడంతోనే తెలంగాణ రాష్ట్ర సమితి విజయం దాదాపు ఖాయమైంది. కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం ఒకరు వరమనుకుంటే మరొకరు శాపంగా భావిస్తున్నారు. ఇలా ఇరు పార్టీల మధ్య బేదాభిప్రాయాలకు కారణం ఆ రెండు పార్టీల గత వైఖరే అని ప్రజలు భావిస్తున్నారు. ఒకరికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెబితే ఆ తీర్పును గౌరవించకుండా ఆ ఇద్దరు జత కలవడం ఓటేసిన వారికి అవమానంగానే పరిగణిస్తున్నారంటున్నారు. ఇది తెలంగాణ ఎన్నికల్లో ప్రస్పుటంగా వెల్లడవుతోంది. తెలంగాణలో జరుగుతున్న ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించడమే ఏకైక లక్ష్యంగా కలిసిన మహాకూటమిని ప్రజలు వ్యతిరేక - అనైతిక పొత్తుగానే భావిస్తున్నారని అంటున్నారు.
ఇక మహాకూటమికి బాలారిష్టాలు తప్పడం లేదు. టిక్కట్ల కోసం నాలుగు సంవత్సరాలుగా ఎదురుచూపులు చూస్తున్న వారికి ఎదురుదెబ్బ తగిలే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ ఆశావహులు తమ ప్రధాన కార్యాలయాల ముందు టిక్కట్ల కోసం ధర్నాలు చేస్తున్నారు. అంతే కాదు.... తమకు... తమ వారికీ కాకుండా వేరెవరికైనా టిక్కట్లు ఇస్తే వారి ఓటమి కోసం పని చేస్తామని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఇదీ మహాకూటమిలో జరుగుతున్న బహిరంగ టిక్కట్ల యుద్ధం. ఈ యుద్ధంలో గెలిచి టిక్కట్లు సాధించినా వారికి ప్రజల నుంచి ఏ మేరకు మద్దతు లభిస్తుందో అనేది అనుమానమే. చంద్రబాబు నాయుడు పట్ల తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న తెలంగాణ ప్రజలకు ఆయనతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం సుతారాము ఇష్టం లేదు. ఈ కలయికకు ముందు కొద్దో గొప్పో ఆశలున్న కాంగ్రెస్ పార్టీకి తాను తెలుగుదేశం పార్టీతో కలవాలని నిర్ణయించుకోవడంతోనే ఆ ఆశలు అడియాశలుగా మారాయి. అంటే పరోక్షంగా చంద్రబాబు నాయుడి కారణంగానే కాంగ్రెస్ పార్టీతో పాటు తెలంగాణ జన సమితి - సిపీఐలు మూల్యం చెల్లించుకునే పరిస్థితే కనపడుతోంది. మహా కూటమిలో పార్టీల కలయిక తెలంగాణ రాష్ట్ర సమితికి మేలు చేసేలాగా కనిపిస్తోంది.