Begin typing your search above and press return to search.
పెండింగ్ సీట్లన్నీ కీలకమేనట!..బాబు వ్యూహమేంటో?
By: Tupaki Desk | 13 March 2019 4:38 PM GMTసార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలై అప్పుడే నాలుగు రోజులైపోయింది. షెడ్యూల్ విడుదల కంటే ముందుగానే అభ్యర్థుల ఖరారుపై అన్ని రాజకీయ పార్టీలు దృష్టి పెట్టినా... ఏపీలో అధికార పార్టీ హోదాలోని టీడీపీ ఈ విషయంలో తనదైన శైలి వ్యూహంతో ముందుకు సాగుతోంది. జిల్లాలు - పార్లమెంటు నియోజకవర్గాలు - ఆ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు... టికెట్ల ఖరారుపై ఓ అంచనాకు వస్తున్న ఆ అభ్యర్థుల పేర్లను నేరుగా ప్రకటించకుండా... తన అనుకూల మీడియాకు లీకులిచ్చేసి సైలెంట్ అయిపోతున్నారు. విపక్షం వైసీపీ తన అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే తాను అధికారికంగా ప్రకటన విడుదల చేయాలన్న లక్ష్యంతో సాగుతున్న కారణంగానే చంద్రబాబు ఈ లీకేజీ మంత్రాన్ని పఠిస్తున్నట్టుగా సమాచారం.
ఇక ఈ లీకు వార్తల ప్రకారం రాష్ట్రంలోని దాదాపుగా 140 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు... మిగిలిన 30 సీట్లకు మాత్రం ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. 140 సీట్లను ఏకబిగిన తేల్చేసిన చంద్రబాబు.... ఈ 30 సీట్లను ఎందుకు తేల్చలేకపోయారన్న విషయానికి వస్తే... ఈ స్థానాలన్నీ పార్టీకి కీలకం కానుండటంతోనే వీటిపై వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారట. అయితే షెడ్యూల్ విడుదలైపోవడం - వైసీపీలోకి వలసల జోరు పెరగడం - వైసీపీ అభ్యర్థులు కూడా ఖరారైపోతున్న నేపథ్యంలో ఈ 30 సీట్లపై కూడా చంద్రబాబు దృష్టి సారించక తప్పలేదన్న వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే... ఇంకా ఖరారు కాకుండా ఉండిపోయిన సీట్లలో తన సొంత జిల్లా చిత్తూరుకు చెందినవే నాలుగు స్థానాలున్నాయట. వాటిలో సత్యవేడు - మదనపల్లి - శ్రీకాళహస్తి - తంబళ్లపల్లె ఉన్నాయి.
ఈ నాలుగింటిలో మదనపల్లి మినహా మిగిలిన మూడు సీట్లు కూడా టీడీపీకి సిట్టింగ్ సీట్లే. అయితే ఈ సీట్ల కోసం ప్రస్తుతం సిట్టింగ్ లుగానే ఉన్న వారితో పాటు మిగిలిన చాలా మంది కూడా తమవంతు యత్నాలు సాగిస్తున్నారట. దీంతోనే ఈ సీట్లపై తన నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తున్న చంద్రబాబు.. ఇప్పుడు వాటిపై దృష్టి సారించనున్నట్టు సమాచారం. ఇక ఈ సీట్లతో పాటు కృష్ణా జిల్లాలోని కైకలూరు - నూజివీడు - తిరువూరుల స్థానాలపైనా చంద్రబాబు దృష్టి సారించనున్నారు. ఇంకా తేలని గుంటూరు జిల్లా బాపట్లపైనా బాబు దృష్టి పెట్టనున్నారట. మొత్తంగా రేపటి ఎన్నికల్లో ఈ సీట్లన్నీ కీలకం కానున్నాయని - వీటిపై నిర్ణయం తీసుకునే క్రమంలో చంద్రబాబు చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.