Begin typing your search above and press return to search.

హ‌స్తంతో పొత్తు!...బాబుకు ఆశ చావ‌లేదు!

By:  Tupaki Desk   |   16 Feb 2019 5:40 AM GMT
హ‌స్తంతో పొత్తు!...బాబుకు ఆశ చావ‌లేదు!
X
మ‌రో రెండు నెల‌ల్లో ఇటు ఏపీ అసెంబ్లీతో పాటు అటు సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఎన్నిక‌ల్లో అవలంబించాల్సిన వ్యూహంపై టీడీపీ కీల‌క భేటీ కానుంది. ఈ క్ర‌మంలోనే చాన్నాళ్ల త‌ర్వాత పొలిట్ బ్యూరో భేటీకి తెర తీసిన టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు... ఈ భేటీలో చాలా అంశాల‌నే ఎజెండాగా పెట్టుకున్న‌ట్టుగా విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఏ ఎన్నిక‌ల్లోనూ ఒంట‌రిగా బ‌రిలోకి దిగే ధైర్యం చేయ‌ని చంద్ర‌బాబు... ఈ ఎన్నిక‌ల్లో త‌న‌తో క‌లిసి వ‌చ్చే పార్టీలేవ‌న్న విష‌యంపై మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. ఓ వైపు గ‌డ‌చిన ఎన్నికల్లో త‌న‌తో క‌లిసి రావ‌డంతో పాటుగా త‌న‌కు అధికారం ద‌క్కేలా ఉప‌యోగ‌ప‌డిన బీజేపీ - జ‌న‌సేన‌లో ఇప్ప‌టికే టీడీపీతో పొత్తు లేద‌ని తేల్చేశాయి. బీజేపీతో పొత్తును త‌న‌కు తానుగా చంద్ర‌బాబు తెంచేసుకోగా... జ‌న‌సేన ఏకంగా చంద్ర‌బాబును ఛీకొట్టేసింది.

ఈ క్ర‌మంలో మొన్న‌టి తెలంగాణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో జ‌ట్టు క‌ట్టిన చంద్ర‌బాబు... టీడీపీ సైద్ధాంతిక‌త‌ను గంగ‌లో క‌లిపేశారు. అయితే రాష్ట్రాన్ని విభ‌జించిన పాపంతో కాంగ్రెస్ ఏపీలో భారీ న‌ష్టాన్ని మూట‌గట్టుకున్న నేప‌థ్యంలో తెలంగాణ మాదిరిగా ఏపీలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే... ఎలాంటి ఫ‌లితం వ‌స్తుందోన‌న్న భ‌యం బాబును వెంటాడుతోంది. ఇదే భావ‌న‌తో చాలా కాలం నుంచి కాంగ్రెస్‌తో పొత్తుపై రెండు నాల్క‌ల ధోర‌ణిని బ‌య‌ట‌పెట్టుకున్న చంద్ర‌బాబు... ఇప్ప‌టిదాకా ఆ పార్టీతో పొత్తు ఉంటుందా? లేదా? అన్న అంశాన్ని తేల్చే ధైర్యం కూడా చేయ‌లేక‌పోతున్న ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో నేడు భేటీ కానున్న టీడీపీ పొలిట్ బ్యూరోలో బాబు దీనిపై ఓ స్ప‌ష్ట‌త ఇవ్వ‌నున్న‌ట్లుగా స‌మాచారం. మొత్తంగా కాంగ్రెస్ తో క‌లిసి ముందుకు సాగే విష‌యంపై మ‌రోమారు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర తీసిన చంద్రబాబు... భేటీలో ఏ త‌ర‌హా నిర్ణ‌యం తీసుకుంటార‌న్న విష‌యంపై నిజంగానే ఆస‌క్తి నెల‌కొంది.

అస‌లు ఎప్ప‌టిక‌ప్పుడు జ‌ర‌గాల్సిన పొలిట్ బ్యూరో భేటీని గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో అస‌లు దాని గురించే మాట్లాడే ధైర్యం చేయ‌ని చంద్ర‌బాబు... ఇప్పుడు త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లోనే ఈ భేటీకి తెర తీశార‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. ఇక ఈ భేటీలో రానున్న ఎన్నిక‌ల్లో పార్టీ అనుస‌రించాల్సిన వ్యూహం, ఇటీవ‌లే పార్టీ నుంచి చేజారిపోతున్న నేత‌లు, వారంతా నేరుగా వైసీపీలోకి చేరుతున్న వైనంపైనా కీల‌క చ‌ర్చ జ‌ర‌గ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇక ఎన్నిక‌ల ముందు పార్టీ సీనియ‌ర్ నేత‌, ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసిన తీరుపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌ర‌గ‌నున్న‌ట్లు స‌మాచారం. సోమిరెడ్డి రాజీనామా పార్టీ వ్యూహం ప్ర‌కార‌మే జ‌రిగింద‌న్న వాద‌న వినిపిస్తున్నా... ఈ వ్యూహం త‌మకు క‌లిసివ‌స్తుందా? లేదంటే ఏకంగా దెబ్బ కొట్టేస్తుందా? అన్న విష‌యంపై ఇప్ప‌టికే పార్టీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో ఏకంగా పొలిట్ బ్యూరోలో ఈ అంశంపై చ‌ర్చ అంటే మ‌రింత ఆస‌క్తి క‌లిగిస్తోంది. ఇప్ప‌టికే అసెంబ్లీ పోరులో వ‌రుస‌గా మూడు ప‌ర్యాయాలు ఓట‌మిపాలైన సోమిరెడ్డి... పార్టీ ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఎలా గెలుస్తార‌న్న‌ది అస‌లు సిస‌లు ప్ర‌శ్న‌గా వినిపిస్తోంది. దీనిపై కూలంక‌ష చ‌ర్చ లేకుండానే ఆయ‌న చేత ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేయించేసిన చంద్ర‌బాబు... ఒక‌వేళ ఈ ఎన్నిక‌ల్లోనూ సోమిరెడ్డి ఓట‌మిపాలైతే ఏం చేయాల‌న్న కోణంలో మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. మొత్తంగా నేటి పొలిట్ బ్యూరో భేటీలో బొచ్చెడ‌న్ని అంశాల‌ను ముందేసుకోనున్న చంద్ర‌బాబు... ఏ త‌ర‌హా నిర్ణ‌యాలు తీసుకుంటార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.