Begin typing your search above and press return to search.
ఇక మనది ఆధార్ ప్రదేశ్ !
By: Tupaki Desk | 10 Aug 2015 4:14 PM GMTటెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్టైలే వేరు. తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు టెక్నాలజీ ద్వారా సమైక్యాంధ్రను సరికొత్త పుంతలు తొక్కించారు. ఇక భవిష్యత్తులో ఆధార్ అన్ని పనులకు ఆధారం కానుంది. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా అన్ని ప్రభుత్వ సేవలకు ఆధార్‌ను అనుసంధానం చేయనుందని చంద్రబాబు చెప్పారు. ఆధార్ ద్వారా అన్ని ప్రభుత్వ సేవలు ఆన్ లైన్ లో అందించి..ఈ విషయంలో దేశంలోనే టాప్ పొజిషన్ కు చేరుకుంటామన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
సోమవారం ఆయన దేశంలో తొలి విదేశీ కంపెనీ షోమి ఉత్పత్తులైన రెండు స్మార్ట్ పోన్ల ను మార్కెట్ లోకి విడుదల చేశారు. విశాఖలోని నోవాటెల్ హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ మేకిన్ ఇండియా, మేడ్ ఇన్ ఏపీ పిలుపు మేరకు స్పందించి జియోమీ ఇక్కడ తన ఉత్పత్తులు ప్రారంభించడం హర్షణీయమన్నారు.
ఏపీలో పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో (ఏకగవాక్ష విధానం) ప్రవేశపెట్టామని..దీని ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకుంటే వారికి రెండు మూడు వారాల్లోనే అన్ని అనుమతులు వచ్చే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇక జియోమీ కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ సామ్‌సంగ్, ఆపిల్ సెల్‌ఫోన్ల కు గట్టి పోటీ ఇస్తామని చెప్పారు. తమది ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ల తయారీలో ప్రపంచంలో మూడో అతి పెద్ద సంస్థ అని వారు చెప్పారు.