Begin typing your search above and press return to search.

ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్ట్ కేరాఫ్ క‌ర్నూలు!

By:  Tupaki Desk   |   9 Nov 2015 9:33 AM GMT
ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్ట్ కేరాఫ్ క‌ర్నూలు!
X
ఊహించ‌ని వ‌రాన్ని సీమ‌కు ఇచ్చారు.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు. సీమ ముఖ‌ద్వారంగా వ్య‌వ‌హ‌రించే క‌ర్నూలుకు భారీ వ‌రాన్ని ప్ర‌క‌టించి సీమ‌వాసుల్ని సంతోష పెట్టేశారు. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో.. ఏపీ స‌ర్కారు త‌న దృష్టి మొత్తాన్ని కోస్తాకే ప‌రిమితం చేసింద‌ని.. రాయ‌ల‌సీమ‌.. ఉత్త‌రాంధ్ర‌ను అస్స‌లు ప‌ట్టించుకోవ‌టం లేదంటూ ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌కు వ‌రంతో బ‌దులిచ్చారు చంద్ర‌బాబు.

సోమ‌వారం క‌ర్నూలు జిల్లా ఓర్వ‌క‌ల్లు (క‌ర్నూలు న‌గ‌రానికి ద‌గ్గ‌ర్లో)లో ఉర్దూ విశ్వ‌విద్యాల‌య నిర్మాణం కోసం శంకుస్థాప‌న చేసిన సంద‌ర్భంగా బాబు మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ప‌లు వ‌రాల్ని ప్ర‌క‌టించారు. ఇందులో అత్యంత కీల‌క‌మైంది క‌ర్నూలు న‌గ‌రంలో అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాన్ని ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. క‌ర్నూలులో విమానాశ్ర‌యాన్ని ఏర్పాటు చేయాల‌న్న ప్ర‌తిపాద‌న ఎప్ప‌టినుంచో ఉన్న‌ప్ప‌టికీ.. అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాన్ని ఏర్పాటు చేస్తామ‌న్న మాట మాత్రం ఇదే మొద‌టిసారి.

ఒక‌వేళ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి సంబంధించిన హామీ అమలు అయితే అసంత‌పృప్తితో ర‌గిలిపోతున్న సీమ వాసులు ఆనందంలో మునిగిపోవ‌టం ఖాయం. అంత‌ర్జాతీయ విమానాశ్ర‌య మాట వాస్త‌వ రూపం దాలిస్తే..క‌ర్నూలు రూపురేఖ‌లు మొత్తంగా మారిపోవ‌ట‌మే కాదు.. చుట్టుప‌క్క‌ల ప్రాంతాలు భారీగా అభివృద్ధి చెందే అవ‌కాశం ఉంది. క‌ర్నూలు న‌గ‌రంలో అంత‌ర్జాతీయ విమానాశ్ర‌య ప్ర‌క‌ట‌న‌తో పాటు.. క‌ర్నూలులో 900 ఎక‌రాల్లో ఎడ్యుకేష‌న్ హ‌బ్‌.. స్ట‌డీ స‌ర్కిల్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఇక‌.. ఈ నెల నుంచి ఈమామ్ ల‌కు నెల‌కు రూ.5వేలు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మ‌రోవైపు.. ఏపీకి మ‌రో తీపిక‌బురు వ‌చ్చింది. విశాఖ‌ప‌ట్నాన్ని టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు వీలున్న న‌గ‌రంగా గుర్తించారు. విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌ మైదానానికి టెస్ట్‌ హోదా లభించింది.ముంబయిలో సోమ‌వారం నిర్వహించిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణ‌యంతో టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ల‌కు అవ‌కాశం క‌ల‌గ‌నుంది. మ‌రి.. విశాఖ‌లో మొద‌టి టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు నిర్వ‌హిస్తారో..?