Begin typing your search above and press return to search.
చంద్రబాబు పబ్లిసిటీ లేఖలు!
By: Tupaki Desk | 19 July 2020 12:30 PM GMTఅవసరం లేని పనులు ఎక్కువగా చేయటంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మించినోళ్లు లేదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అధికారంలో ఉన్నంతనే.. పొద్దున్న వేలాది మందితో కూర్చొని వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ గంటల కొద్దీ కాలాన్ని గడుపుతారు. ఇక.. రివ్యూల పేరుతో చేసే హడావుడి అంతా ఇంతా కాదు. తనను కలిసేందుకు వచ్చిన వారు తమ టైమంతా వెయిట్ చేయటానికే సరిపోయే పరిస్థితి. పవర్లో ఉన్నప్పుడు ఇలా చేసే బాబు.. అధికారం లేనప్పుడు కూడా రివ్యూలు.. సమావేశాలు అంటూ గంటల కొద్దీ సమయాన్ని కేటాయిస్తుంటారు. అవసరం ఉన్నా.. లేకున్నా డైలీ ప్రభుత్వాన్ని విమర్శించటమే పనిగా పెట్టుకుంటారు.
ప్రజలు అధికారాన్ని కట్టబెట్టిన ప్రభుత్వానికి కాస్త సమయం ఇచ్చి.. వారి పాలనలో అదే పనిగా తప్పులు దొర్లుతున్నప్పుడు వేలెత్తి చూపటంలో అర్థముంటుంది. అందుకు భిన్నంగా ప్రతి విషయాన్ని తప్పు పట్టటం.. విమర్శలు చేయటం లాంటి వాటితో ఏపీ ప్రజలు విసిగిపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విపక్ష నేతగా జగన్ వ్యవహరించిన సమయాన్ని చూస్తే.. ఎప్పుడేం చేయాలో అది మాత్రమే చేసిన వైనం గుర్తుకు రాక మానదు. ప్రజల్లో ఒకింత వ్యతిరేకత పెరిగిన తర్వాత.. ప్రతిపక్ష నేతగా ఏం మాట్లాడినా బాగుంటుంది. అలా కాకుండా తగదునమ్మా అంటూ అవసరం ఉన్నా.. లేకున్నా ముందుకొచ్చేస్తున్న తీరుతో మైలేజీ రావటం తర్వాత.. మొదటికే మోసం వస్తున్న పరిస్థితి.
తాజాగా గవర్నర్ భిశ్వభూషణ్ కు ఆరుపేజీల లేఖ రాశారు. పరిపాలనా వికేంద్రీకరణ.. సీఆర్ డీఏ చట్టం రద్దు బిల్లులు 2014 ఏపీ పునర్ వ్యవస్థీకరణచట్టానికి వ్యతిరేకమని బాబు పేర్కొన్నారు. ఏపీని కాపాడాలంటూ ఆయన పేర్కొన్నారు. రాజకీయ కక్షల ముసుగులో జగన్ ప్రభుత్వం రెండు బిల్లుల్ని తెచ్చిందన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనతో బిల్లును తెచ్చిందని.. మండలి సెలెక్టు కమిటీకి పంపినట్లుగా పేర్కొన్నారు. వారి నుంచి రిపోర్టు రాక ముందే.. బిల్లుల్ని గవర్నర్ ఆమోదం కోసం ఎలా పంపుతారని బాబు ప్రశ్నిస్తున్నారు.
అమరావతి అంశం హైకోర్టులో పెండింగ్ లో ఉన్నప్పుడు అసెంబ్లీ రూల్స్ ప్రకారం బిల్లుల్నిచర్చించటం.. ఆమోదించటం.. కోర్టు ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో ప్రధాని మోడీ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయన్ని గుర్తు చేశారు.
ఢిల్లీ కంటే మెరుగైన నగరంగా నిర్మిస్తామని శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోడీ పేర్కొన్నారన్నారు. కేంద్రం అమరావతిని స్మార్ట్ సిటీగా గుర్తించిందన్నారు. ప్రస్తుత సెక్రటేరియట్.. శాసన సభ.. మండలి.. హైకోర్టు ఇతర మౌలిక సదుపాయాల కోసం రూ.2500 కోట్లు సమకూర్చిన వైనాన్ని గుర్తు చేస్తూ.. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కోసం రూ.700 కోట్ల అదనపు నిధుల్ని ఇచ్చారన్నారు. అమరావతిలో హైకోర్టుకు అనువైన ప్రదేశంగా సుప్రీంకోర్టు నోటిఫై చేసిన వైనాన్ని లేఖలో ప్రస్తావించారు చంద్రబాబు.