Begin typing your search above and press return to search.
బాబు కేంద్రంగా కూటమిలో చీలిక?
By: Tupaki Desk | 4 Dec 2018 6:02 AM GMTఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పై కూటమిలో అసహనం మొదలైందా? ఆయన కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ నేత ల్లో చీలిక వస్తోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణలో చంద్రబాబునాయుడు అడుగుపెట్టడం ఏమాత్రం ఇష్టం లేని విభిన్న సామాజికవర్గాలు - ఉద్యోగ - కార్మికవర్గాలు ప్రజాకూటమికి దూరమవుతున్నాయని, కాంగ్రెస్ - సీపీఐ - టీజేఎస్ కు ఎంతోకొంత అనుకూలంగా ఉన్నవారు కూడా ఒక్కొక్కరుగా గుడ్ బై చెప్తున్నారని కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్లు పార్టీ ముఖ్యలకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. . చంద్రబాబు వస్తే ఉన్న ఓట్లు కూడా పోతాయని నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బహిరంగంగానే చెప్పడం బాబుకు కూటమి లో ఎదురవుతున్న వ్యతిరేకతను నిదర్శనమని అంటున్నారు.
కాంగ్రెస్ నేతలు బాబు పొడను గిట్టకపోవడం, తీవ్రం గా అసంతృప్తి ఉన్న నేపథ్యంలో హస్తం పార్టీలో కొత్త చర్చ మొదలైంది. విద్యావంతులు, మేధావులు తమకు అనుకూలంగా ఉన్నారని కాంగ్రెస్ నిన్నమొన్నటి వరకు ఆశపెట్టుకున్నది. కానీ, ఇప్పుడు చంద్రబాబు పెత్తనం చూసిన విద్యావంతులు, మేధావులు ఇక తమవల్ల కాదని కూటమి పక్షాన మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారని అంటున్నారు. కూటమిలో ఒక్క విద్యార్థికి కూడా పోటీచేసేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో వీరు మొత్తం దూరమయ్యారని చెప్తున్నారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను తెలుసుకున్న కాంగ్రెస్ అధిష్టానం పత్రికా ప్రకటనల్లో చంద్రబాబు ఫొటో పెట్టేందుకు కూడా జంకుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రకటనల్లో బాబు ఫొటోను హైదరాబాద్ - ఖమ్మం జిల్లాల్లో మినహా మరే జిల్లాలోనూ వాడటం లేదు. ఉత్తర తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉందంటున్నారు. ప్రజాకూటమి తరఫున ఇచ్చే పత్రికా ప్రకటనల్లో చంద్రబాబు బొమ్మపెట్టవద్దంటున్నారు. ముఖ్యంగా తూర్పు - పశ్చిమ గోదావరి జిల్లాలు,- కృష్ణా - గుంటూరు - ప్రకాశం జిల్లాలకు చెందిన ఓ బలమైన సామాజికవర్గం ప్రజాకూటమికి దూరమైందని విశ్లేషకులు చెప్తున్నారు. వీరు టీఆర్‌ఎస్ లోని తమ వర్గం నేతలను కలిసి మద్దతు ప్రకటించారు.
సామాజికంగా టీడీపీ తో విభేదించేవర్గాలు ఇప్పుడు కాంగ్రెస్‌ను అంతేదూరంలో పెడుతున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఈ తేడా స్పష్టంగా కనపడుతున్నది. ఇంతకాలం కాంగ్రెస్‌కు అండగా ఉన్న రాయలసీమలోని ఓ బలమైన సామాజికవర్గం కూడా చంద్రబాబు కారణంగా ఆ పార్టీకి దూరమవుతున్నది. ఆ సామాజికవర్గానికి చెందినవారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ తాము కూటమికి ఓటువేయడంలేదని చెప్పడం కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చే పరిణామమేనని అంటున్నారు.