Begin typing your search above and press return to search.
వారిద్దరి స్పీచ్ లకు జనం ఫుల్.. బాబు స్పీచ్ స్టార్ట్ కాగానే..?
By: Tupaki Desk | 1 April 2019 7:38 AM GMTవిశాఖ వాసులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దిమ్మ తిరిగే షాకిచ్చారు. ఆయనకు గతంలో ఎప్పుడూ ఎదురుకాని అనుభవం ఒకటి ఎదురైంది. తాజాగా జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో విశాఖపట్నంలో నిర్వహించిన సభకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు.
తన వాదనకు దన్నుగా చూపించేందుకు.. జాతీయ నాయకుల చేత తన పాలనపై పొగడ్తలు కురిపించేందుకు వీలుగా.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని రిక్వెస్ట్ చేసుకొని మరీ ఏపీలో ప్రచారం చేయిస్తున్నారు. తనను పొగడటం.. విపక్ష నేతపై విమర్శలు సంధించాలన్నది బాబు వ్యూహం. అయితే.. బాబు ఎత్తుగడ వర్క్ వుట్ కాలేదు.
బాబును పొగిడే విషయంలో మొహమాటానికి పోయిన మమత.. కేజ్రీవాల్ నాలుగు ముక్కలు పొగిడారే తప్పించి.. బాబు తీరును ప్రశంసించింది లేదు. వారి ప్రసంగం మొత్తం మోడీని టార్గెట్ చేసేలా ఉందని చెప్పక తప్పదు. ఇక.. బాబు ఎంతగానో కోరుకున్నట్లుగా వారు వ్యవహరించలేదు. విపక్ష నేత వైఎస్ జగన్ ను ఉద్దేశించి మాట వరసకు కూడా వారిద్దరు మాట్లాడకపోవటంతో బాబు నిరాశకు గురైనట్లు చెబుతున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. కేజ్రీవాల్.. మమత ప్రసంగాలు పూర్తి అయ్యాక చివర్లో బాబు మైకు అందుకున్నారు. అప్పటివరకూ కిక్కిరిసిన సభాస్థలి.. బాబు ప్రసంగం మొదలు కాగానే.. ఎవరికి వారు వెళ్లిపోవటం షురూ అయ్యింది. ఎప్పటిలానే బాబు ప్రసంగం రోటీగా.. పరమ బోరింగ్ గా ఉండటంతో విసుగుతో వెళ్లిపోయారు. తాను మాట్లాడుతున్నప్పుడు సభాస్థలి వద్ద ఖాళీగా భారీగా ఏర్పడటంతో తెలుగు తమ్ముళ్లు బిత్తరపోయినట్లు చెబుతున్నారు. మొత్తానికి విశాఖ వాసులు తమ చేతలతో బాబుకు భారీ షాకిచ్చారన్న మాట వినిపిస్తోంది.