Begin typing your search above and press return to search.

2 గంటల మీటింగ్ తోనే సర్దుకుంటుందా?

By:  Tupaki Desk   |   5 Dec 2015 8:59 AM GMT
2 గంటల మీటింగ్ తోనే సర్దుకుంటుందా?
X
కడుపులో అసంతృప్తి ఉన్నోడిని పెట్టుకున్నోడికి తృప్తి పర్చటం అంత చిన్న విషయం కాదు. ఏపీలో పవర్ ఎంతన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న అయినా.. పోటుగాళ్లలా వ్యవహరించే కమలనాథులు.. ఏపీ తమ్ముళ్ల మీద ఒంటికాలి మీద లేవటం తెలిసిందే. తమ అసలు బలం మరిచి.. అధికారపక్షంతో పేచీలు పెట్టుకోవటమే తప్ప.. సొంతంగా బలం పెంచుకోవాలన్న ఆలోచన అస్సలు కనిపించదు.

కేంద్రంలో అధికారంలో ఉన్నా.. రాష్ట్రంలో తమ మార్క్ చూపే కార్యక్రమాల నిర్వహణ చేతకాని కమలనాథులు.. ఏపీ అధికారపక్షంతో నిత్యం గిల్లికజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ మధ్య ఇలాంటి గొడవలు మరింత ముదరటంతో తాజాగా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. శనివారం బెజవాడలో ఏర్పాటు చేసిన మీటింగ్ ను దాదాపు రెండు గంటల పాటు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేశ్ తో పాటు.. బీజేపీ నేతలు పలువురు హాజరయ్యారు.

సమావేశం ముగిసిన తర్వాత బీజేపీ నేతలు మాట్లాడుతూ.. తమ మధ్యనున్న విభేదాల్ని పక్కన పెట్టి.. సమన్వయ భేటీ జరిగిందని.. నెలకు ఒకసారి భేటీ కావాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. ఏదైనా సమస్యలు వస్తే మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని చెప్పుకొచ్చారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే వైఖరికి చెక్ పెట్టాలని భావించినట్లు చెప్పిన వారు.. రెండు గంటల భేటీతో విభేదాలు సర్దుబాటు అయినట్లు చెప్పారు. కేవలం రెండు గంటల భేటీతోనే గొడవలు సర్దుబాటు అయ్యేపక్షంలో మరింత కాలం ఏం చేసినట్లో..?