Begin typing your search above and press return to search.
బాబు గారి కుల ప్రవచనాలు...అదిరిపోలా !!
By: Tupaki Desk | 2 July 2019 7:58 AM GMTవయసు పైబడిన కారణమో లేదా తన మార్క్ రాజకీయాలకు కాలం చెల్లడం వల్లో గాని చంద్రబాబు గత రెండేళ్లుగా దశ దిశ లేని రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయాక ఎక్కడెక్కడ తప్పులు జరిగాయో సమీక్షలు చేసుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం ఏ పార్టీ అయినా చేయాల్సి ఉంటుంది. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా పార్టీకి అనేక షాక్‌లు తగిలాయి. నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి వెళ్లిపోతే... పార్టీకి చెందిన పలువురు నేతలు కాకినాడలో రహస్యంగా సమావేశం పెట్టుకుని చంద్రబాబుపై తమ అక్కసు వెళ్లగక్కడంతో పాటు తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటన్న దానిపై చర్చించుకున్నారు.
చంద్రబాబు ఇండియాకు తిరిగి వచ్చాక ఈ నేతలకు ఫోన్లు చేసి బుజ్జగింపులు మొదలెట్టారు. అలా కాదు కూర్చుని మాట్లాడుకుందాం రండి అంటూ కబురు పంపారు. దీంతో టీడీపీ కాపు నేతలంతా సోమవారం ముందుగా విజయవాడ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు ఇంట్లో సమావేశమై ఆ తర్వాత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో చంద్రబాబు చెప్పిన నీతి సూత్రాలు చూసి టిడిపి కాపు నేతలకు మతి పోయిందట. కాపు నేతలను ప్రత్యేకంగా పిలిపించుకొని మరి సమావేశం పెట్టిన బాబు... కులాలవారీగా సమావేశాలు పెట్టొద్దు... అది పార్టీకి మంచిది కాదని తమకు చెప్పడంతో వారంతా అవాక్కయ్యారట.
చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి ఏవో అన్నట్టుగా చంద్రబాబు నీతి సూత్రాలు ఉన్నాయని ఈ భేటీకి వచ్చిన కొందరు కాపు నేతలు రుసరుసలాడుతున్నారు. వాస్తవంగా చూస్తే చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో కాపులకు ఎంతోకొంత చేశారు. అయితే కాపులను నమ్మి మాత్రం చంద్రబాబు వాళ్లకు మేళ్లు చేయలేదు. అందుకే వారంతా ఎన్నికల్లో బాబుకు దిమ్మతిరిగే తీర్పు ఇచ్చారు. కాపు జనాలు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా టిడిపి విజయం సాధించలేదు. ముందు నుంచి కాపులకు ఏదో చేస్తున్నట్టు హైప్ తీసుకు వచ్చిన చంద్రబాబు ఎన్నికల్లో మాత్రం వాళ్లకు వేయాల్సిన దెబ్బ వేసేశారు.
కాపు సామాజిక వర్గం నేతలు పోటీ చేసిన చోట్ల వారి విషయంలో ఆర్థికంగా చిన్నచూపు చూశారు అన్న అసంతృప్తి వాళ్ళలో ఉండనే ఉంది. ఇక ముద్రగడ విషయంలో చంద్రబాబు సరిగా వ్యవహరించలేదు అన్న అసంతృప్తి కూడా కాపుల్లో ఉంది. విచిత్రం ఏంటంటే చంద్రబాబుతో భేటీకి వెళ్ళిన కాపు నేతల్లో చాలామంది ఇప్పటికే బిజెపి పెద్దలతో టచ్ లోకి వెళ్ళిపోయారు. మరికొందరు జగన్ ఎప్పుడు గేట్లు తెరుస్తాడా ? అని కాచుకునే చూస్తున్నారు. ఇలాంటి నేతలతో చంద్రబాబు మీటింగ్ లు పెట్టి నీతి సూత్రాలు వల్లెవేయటం కామెడీ కాకపోతే మరేమవుతుంది.