Begin typing your search above and press return to search.
సత్యానాదెళ్లతో బాబు..ట్రంప్ విషయం సైడ్!
By: Tupaki Desk | 18 Jan 2017 4:40 AM GMTవరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరుస మీటింగ్ లతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో సమావేశం అయ్యారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ముఖ్యమంత్రులతో ఉపసంఘానికి కన్వీనర్ గా ఉన్న చంద్రబాబు ఈ క్రమంలో సత్య నాదెళ్ల నుంచి కొన్ని సలహాలు స్వీకరించారని చెప్తున్నారు. ఈ-గవర్నెన్స్ - సైబర్ భద్రత అంశాల్లో కలిసి పనిచేయాలని సత్యనాదెళ్లను చంద్రబాబు కోరారు. అలాగే హైబ్రిడ్ క్లౌడ్ టెక్నాలజీని ఏపీ అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా సత్యనాదెళ్ల సూచించారని సమాచారం. ఈ క్రమంలో డిజిటల్ లావాదేవీలు పెంచేందుకు చేపట్టాల్సిన పలు అంశాలను చర్చించినట్లు చెప్తున్నారు.
ఇదిలాఉండగా త్వరలో అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ విషయంలో మిగతా వ్యాపారవేత్తలు బెంబేలెత్తిపోతున్నప్పటికీ సత్యనాదెళ్ల మాత్రం రిలాక్స్‌గా ఉన్నారని అంటున్నారు. అమెరికన్లకే ఎక్కువ ఉద్యోగాలు కల్పించడమే ఇందుకు కారణమని సమాచారం. మైక్రోసాఫ్ట్ లో ప్రపంచవ్యాప్తంగా 1.13,00 మంది ఉద్యోగులుండగా.. వారిలో 64,000 మందికి పైగా అమెరికాలోని వారే కావడం ఈ భరోసాకు కారణం. అమెరికన్ ఉద్యోగాలు అమెరికన్లకే అనే ప్రధాన ఎన్నికల సూత్రం ట్రంప్ అమెరికా అధ్యక్ష బరిలో దిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలిచిన అనంతరం 12 టెక్ దిగ్గజ సీఈవోలతో ట్రంప్ గత నెల భేటీ అయ్యారు. ఈ సీఈవోల్లో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా ఉన్నారు. కాగా అమెరికన్లకే ఉద్యోగాలు కల్పించాలని ఈ సమావేశంలో ట్రంప్ నొక్కి చెప్పినప్పటికీ సత్య ఏమాత్రం ఇబ్బంది పడకపోవడం, అంతేకాకుండా ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పదవిలోకి వచ్చిన తర్వాత మైక్రోసాఫ్ట్ రోడ్ మ్యాప్ ఏమీ మారదని చెప్పడం వెనుక కారణం కూడా ఇప్పటికే పెద్ద సంఖ్యలో మైక్రోసాఫ్ట్ ద్వారా అమెరికన్లకు కల్పించిన ఉద్యోగ అవకాశాలే కారణమని అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/