Begin typing your search above and press return to search.

40 ఏళ్ల ఇండ‌స్ట్రీ... అస‌లు స‌త్తా ఇది !

By:  Tupaki Desk   |   1 Nov 2018 11:35 AM GMT
40 ఏళ్ల ఇండ‌స్ట్రీ... అస‌లు స‌త్తా ఇది !
X
గ‌త రెండేళ్లుగా చంద్ర‌బాబు నోరు తెరిస్తే చాలు... దేశంలో నేను సీనియ‌ర్‌ని అని చెప్పుకుంటూ ఉంటారు. ఇక ఆయ‌న అనుయాయులు అయితే... జాతీయ రాజ‌కీయాల్లో బాబును త‌ల‌ద‌న్నేవాడు లేడ‌ని అంటుంటారు. తీరాచూస్తే గ‌త నాలుగైదు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ల్లో చంద్ర‌బాబును గ‌మ‌నించిన వారికి జాతీయ స్థాయిలో చంద్ర‌బాబు స‌త్తా ఏంటో అర్థ‌మైపోయింది. చంద్ర‌బాబు మీడియా స‌మావేశం పెడితే... చివ‌ర‌కు జాతీయ ఛాన‌ళ్ల నుంచి పెద్దగా స్పంద‌న క‌నిపించ‌లేదు. అది చాలు ఆయ‌న ఢిల్లీలో ఎంత వీక‌య్యారో చెప్ప‌డానికి. చాలా సార్లు తెలుగు ఛానెళ్లు మాత్ర‌మే క‌నిపించాయి. తాజాగా శ‌ర‌ద్‌ప‌వార్‌తో క‌లిసి మీడియాతో మాట్లాడిన‌పుడు మాత్ర‌మే జాతీయ ఛానెళ్ల హ‌డావుడి క‌నిపించింది. అది వాళ్ల సీనియారిటీకి బాబు సీనియారిటీకి తేడా. జాతీయ స్థాయిలో 40 ఏళ్ల ఇండ‌స్ట్రీ బాబుకు ... నిరంత‌రం నేష‌నల్ మీడియా నోళ్ల‌లో నానే మిగ‌తా వాళ్ల‌కీ అదీ తేడా.

మ‌రి కాంగ్రెస్ ఎందుకు అంతగా చంద్ర‌బాబుకు ప్రాధాన్యం ఇస్తుంద‌ని కొంద‌రు త‌మ్ముళ్లు డ‌ప్పా కొడుతున్నారు. దానికో రీజ‌న్ ఉంది. కాంగ్రెస్‌ ను ప్ర‌మోట్ చేయ‌మ‌ని చెబితే... శ‌ర‌ద్‌ ప‌వార్‌ - ఫ‌రూక్ అబ్దుల్లా - మాయావ‌తి - మ‌మ‌తా బెన‌ర్జీ వంటి సీనియ‌ర్ నేత‌లు వింటారా? అస్స‌లు విన‌రు. అదే చంద్ర‌బాబు అయితే... త‌నకు చాలా ప్రాధాన్యం ఇచ్చార‌ని ఫీలైపోయి కాంగ్రెస్ చెప్పిన ప‌న‌ల్లా చేసుకుంటూ పోతాడు.

ఇక్క‌డ ఇంకో ట్విస్టు ఉంది. ఇటీవ‌ల ఐటీ దాడుల అనంత‌రం చంద్ర‌బాబు ఢిల్లీ టూర్లు పెంచారు. బ‌య‌ట‌కు ఏమో సేవ్ నేష‌న్ అంటూ పెద్ద పెద్ద మాట‌లు మాట్లాడ‌తారు. నిజానికి కాంగ్రెస్ పంచ‌న చేర‌క‌పోతే ఈ ఐటీ దాడుల నుంచి త‌ప్పించుకుని నిల‌బ‌డ‌టం బాబుకు చాలా క‌ష్టం. అందుకే ఒక జాతీయ పార్టీ అండ‌కోసం చంద్ర‌బాబు ప‌రిత‌పిస్తున్నారు. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే... చంద్ర‌బాబు రాహుల్‌గాంధీ పీఆర్ ఇపుడు. ప‌ప్పు అన్న త‌న నోటితోనే రాహుల్ ప్ర‌మోట్ చేయాల్సిన దుస్థితి చంద్ర‌బాబుది. దెయ్యం అన్న సోనియా దేవ‌త అని పొగ‌డాల్సిన ద‌య‌నీయ స్థితి చంద్ర‌బాబుది.