Begin typing your search above and press return to search.
భూమాకు రూట్ క్లియర్ అవుతోంది..
By: Tupaki Desk | 22 Feb 2016 7:40 AM GMTఏపీలో చంద్రబాబు నాయుడు తన పొలిటికల్ ఆకర్ష్ పథకం వేగం పెంచారు. మూణ్నాలుగు రోజులుగా నానుతున్న వైసీపీ ఎమ్మెల్యేల టీడీపీ ప్రవేశానికి టైం దగ్గర పడుతుండడంతో చంద్రబాబు టీడీపీ నేతలను దారిలో పెట్టి వైసీపీ నేతలకు మార్గం సుగమం చేసే కార్యక్రమానికి తెరతీశారు.
ప్రస్తుతం కలెక్టర్ల సమావేశంలో బిజీగా ఉన్నా కూడా కర్నూలుకు చెందిన టీడీపీ నేతలు శిల్పా మోహనరెడ్డి - ఆయన సోదరుడు చక్రపాణిరెడ్డిలను హుటాహుటిన విజయవాడ రావాలంటూ పిలిచారు. కర్నూలులో భూమా నాగిరెడ్డి టీడీపీలోకి రావడాన్ని వీరు వ్యతిరేకిస్తున్నారు. దీంతో వారికి నచ్చజెప్పేందుకు చంద్రబాబు ఆ ఇద్దరిని పిలిపించుకున్నారు. చంద్రబాబు పిలుపుతో వారు వెంటనే విజయవాడకు బయలుదేరారు. భూమా నాగిరెడ్డి బృందాన్ని టీడీపీలో చేర్చుకునే విషయంపై మాట్లాడేందుకే వారిద్దరినీ పిలిచారన్నది బహిరంగ రహస్యం.
భూమా చేరిక ఇప్పటికే దాదాపు ఖరారైంది. అయితే మధ్యలో కాస్త డైలమా ఏర్పడింది. ఇప్పుడు చంద్రబాబు నేరుగా శిల్పా సోదరులకు కబురుచేయడం... వారు కూడా మొరాయించకుండా రావడం వంటి పరిణామాలన్నీ చూస్తుంటే ఈ రోజు భూమా చేరిక విషయం ఫైనలైజ్ అవుతుందని భావిస్తున్నారు.