Begin typing your search above and press return to search.
తెలంగాణ తమ్ముళ్లతో చంద్రబాబు మీటింగ్!
By: Tupaki Desk | 28 Aug 2019 2:30 PM GMTతెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇంకా ఉందా? అనేది పరిశీలకుల ప్రశ్న. ఎప్పుడైతే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయలేదో అప్పుడే ఆ పార్టీ కథ కంచికి చేరింది. అంతుకు ముందు అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని మరీ పోటీ చేశారు. ఫలితాలు ఎలా వచ్చాయో అందరికీ తెలిసిందే. ఆ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ కూడా ఠారెత్తిపోయింది. మళ్లీ జన్మలో చంద్రబాబుతో పొత్తు కోసం కాంగ్రెస్ పార్టీ సై అనదు! ఆ స్థాయిలో తన మిత్రపక్షాన్ని దెబ్బ కొట్టారు చంద్రబాబు నాయుడు.
ఒకవేళ కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలు పొత్తు పెట్టుకోకుండా పోటీ చేసి ఉంటే.. టీఆర్ ఎస్ కు అంత మెజారిటీ వచ్చేది కాదు అని విశ్లేషకులు కుండబద్ధలు కొడుతూ వచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
అందుకే లోక్ సభ సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ మళ్లీ చంద్రబాబుతో జత కట్టడానికి సాహసం చేయలేదు. ఇక తాము పోటీ చేస్తే, అది కూడా సింగిల్ గా పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకున్న చంద్రబాబు నాయుడు లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థులను పోటీకే పెట్టలేదు.
ఏ హైదరాబాద్ లో అయితే, ఏ తెలంగాణ వేదికగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని చెప్పుకుంటారో అదే ప్రాంతం రాష్ట్రం అయ్యాకా ఐదేళ్లలోనే తెలుగుదేశంపార్టీ కనీసం ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా ముందుకు రాని స్థితికి పడిపోయింది.
ఇక లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పుంజుకోవడం, అప్పటికే తెలుగుదేశం లీడర్లను - క్యాడర్ ను టీఆర్ఎస్ తన వైపుకు తిప్పుకోవడంతో.. టీడీపీ మనుగడ కొశ్చన్ మార్క్ అయ్యింది. ఇంకా తెలుగుదేశంలో మిగిలిన వారు ఎవరైనా ఉంటే వాళ్లంతా టీఆర్ ఎస్ - బీజేపీల వైపు సాగుతూ ఉన్నారు. ఇంకా కనీసం నాలుగేళ్ల వరకూ తెలంగాణలో ప్రధాన ఎన్నికలు ఏవీ లేవు. మరోవైపు ఏపీలో తెలుగుదేశం పార్టీ భారీగా దెబ్బ తింది.
ఇలాంటి పరిణామాల మధ్యన చంద్రబాబునాయుడును ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు తెలుగు తమ్ముళ్లు కలిశారట. వారికి చంద్రబాబు నాయుడు భవిష్యత్తు మీద ఆశలు పెట్టుకోవాలని ఏదో చెప్పారట. మళ్లీ పుంజుకోవడం ఖాయమంటూ వారికి ధైర్యం చెప్పారట చంద్రబాబు నాయుడు! చంద్రబాబు మాటలతో వారిలో కలిగిన భరోసా ఎంతో మరి!