Begin typing your search above and press return to search.
బాబుతో సీనియర్ల భేటీ...టార్గెట్ రేవంత్!
By: Tupaki Desk | 31 July 2016 11:30 AM GMTఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో తెలంగాణ టీడీపీ నాయకుల సమావేశం అంటేనే ఫిర్యాదుల పర్వంగా మారిపోతోంది. దీంతో బాబుకు సర్దిచెప్పేందుకే సమయం సరిపోతుందన్నట్లుగా పరిస్థితి మారిపోయిందనే టాక్ వినిపిస్తోంది. విజయవాడలో టీటీడీపీ నేతలతో బాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నేతలపై బాబు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ - ఎంపీ గరికపాటి మోహన్ రావుతో పాటు పార్టీ సీనియర్లతో సమావేశమైన సందర్భంగా బాబు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సమావేశానికి హాజరుకాలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం...ఈ సందర్భంగా నేతలు రేవంత్ రెడ్డి పైనే ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మల్లన్నసాగర్ పై పార్టీ చేస్తున్న ఆందోళన ఏకపక్షంగా ఉందని, ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఎవరికివారు ఉదయానికి బయలుదేరితే ఎలా సమాచారం తెలుస్తుంది? అందుకే దానిపై సరిగా మైలేజీ రావడం లేదని పార్టీ నేతలు బాబు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన చంద్రబాబు ‘ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు ఆందోళన చేస్తామంటే ఎలా? అంతా కలసి సమష్టి నిర్ణయంతో పోరాటాలు చేయండి. మల్లన్నసాగర్ కు-ఏపీలో భూసేకరణకు తెరాస పోల్చడమేమిటి? ఏపీలో రైతులను భాగస్వాములను చేస్తున్నాం. అదే విషయం మీరు ప్రచారం చేయండి’ అని చంద్రబాబునాయుడు తెలంగాణ తెదేపా నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
బీజేపీతో సంబంధాలపైనా చర్చ జరిగిందని సమాచారం. ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ తిరుపతిలో చెప్పారని, దానిని నెరవేర్చాల్సిన బాధ్యత ఆ పార్టీపై ఉందని చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలను బీజేపీ మభ్యపెడుతోందని, తెలంగాణలో ప్రాణహిత-చేవెళ్ల - ఏపీలో పోలవరం ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదని బాబు అన్నారు. దీనిపై అవసరమైతే రెండు తెలుగు ప్రభుత్వాలు కలసి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు బీజేపీ వైఖరి బట్టి పార్టీ ప్రతిస్పందన ఉంటుందని బాబు స్పష్టం చేశారు. ఏపీలో 50 వేల లోపు మాఫీ ఒకేసారి చేయడంతో లక్షల సంఖ్యలో రైతులు లబ్ధి పొందారని, అదేవిధంగా మిగిలిన వారికి వడ్డీ డిక్లేర్ చేశామని బాబు వారికి వివరించారు. ఇప్పుడు క్రాప్‌లోన్ ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణలో రైతురుణ మాఫీ - భూసేకరణపై సమష్టి పోరాటం చేయాలని ఆదేశించారు. వాటికి సంబంధించి తన డాష్‌బోర్డులో ఉన్న సమాచారాన్ని ట్యాబ్‌లో పార్టీ నేతలకు చూపించారు. ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీపై పార్టీ ఉద్యమించి, విద్యార్ధుల తలిదండ్రుల పక్షాన నిలబడాలని ఆదేశించారు.