Begin typing your search above and press return to search.
రమణా...? రేవంతా...?
By: Tupaki Desk | 18 Sep 2015 6:06 AM GMTతెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ కొనసాగుతారా... లేదంటే కొత్త అధ్యక్షుడు వస్తారా... వస్తే, అది రేవంత్ రెడ్డేనా..? అన్న చర్చ ఆ పార్టీలో సాగుతోంది. టీటీడీపీలో హీరో ఇమేజి తెచ్చుకుంటున్న రేవంత్ రెడ్డిని అక్కడ పార్టీ అధ్యక్షుడిని చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
శుక్రవారం ఉదయం తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటికి తెలుగుదేశం పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు ఎల్.రమణ - టీడీపీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు - రేవంత్ రెడ్డి - మోత్కుపల్లి నర్సింహులు - పెద్దిరెడ్డి నన్నూరి నర్సిరెడ్డి - రాములు తదితరులంతా వచ్చారు. తెలంగాణ టీడీపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై ఈ సందర్భంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఐవీఆర్ ఎస్ విధానంలో పార్టీ క్రియాశీల కార్యకర్తల నుంచి సేకరించిన అభిప్రాయాలను చంద్రబాబు ఈ సమావేశానికి వచ్చినవారికి చెప్పినట్లు తెలుస్తోంది. ముగ్గురు జనరల్ సెక్రటరీల ఉండేలా కమిటీని ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. అయితే నేతలు మాత్రం ఐదుగురు సెక్రటరీ లు ఉండే బాగుంటుందని సూచించారని తెలుస్తోంది. రాష్ట్ర కమిటీలో తెలంగాణలోని ప్రతి జిల్లా నుంచి ఒకరు ఉండేలా కూర్పు చేయాలని సూచించారు.
కాగా ఇంతకుముందు టీడీపీ నేతలు చంద్రబాబును కలిసినప్పుడు ఐవీఆర్ ఎస్ అభిప్రాయాల ఆధారంగానే అధ్యక్షుడిని ఎంపిక చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఐవీఆరెస్ లో అధిక సంఖ్యలో కార్యకర్తలు రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. చంద్రబాబు పార్టీ నేతలకు ఈ సంగతి చెప్పారని... రేవంత్ ఎంపిక లాంఛనమేనని కొందరు అంటున్నారు.
అయితే ఇంకో అభిప్రాయమూ వినిపిస్తోంది. పార్టీలో సీనియర్ ల కోరిక మేరకు చంద్రబాబు ప్రస్తుత అధ్యక్షుడు ఎల్.రమణనే అధ్యక్షుడిగా కొనసాగిస్తారని వాదనలు వినిపిస్తున్నాయి. రమణ వివాద రహితుడు కావడం... తనకు అత్యంత అనుకూలుడు కావడంతో చంద్రబాబు ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తారనీ భావిస్తున్నారు. అయితే... 65 మందితో ఏర్పాటు చేయనున్న తెలంగాణా టీడీపీ శాఖ పగ్గాలను ఎవరికివ్వాలనేది చంద్రబాబు నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. అన్నమాట ప్రకారం ఐవీఆరెస్ లో కార్యకర్తలు వెల్లడించిన అభిప్రాయాలకు విలువిస్తారా.... సీనియర్ ల కోరికను మన్నిస్తారా చూడాలి.