Begin typing your search above and press return to search.

చంద్రబాబు ముందు టీటీడీపీ పంచాయితీ

By:  Tupaki Desk   |   27 Oct 2015 8:03 AM GMT
చంద్రబాబు ముందు టీటీడీపీ పంచాయితీ
X
తెలుగుదేశం కేంద్ర కమిటీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడితో తెలంగాణ తెదేపా నేతలు ఈ రోజు విజయవాడలో సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి, వరంగల్ ఉప ఎన్నిక తదితర అంశాలపై వారు చంద్రబాబుతో చర్చించినట్లు సమాచారం. ఈ భేటీలో తెలంగాణ తెలుగుదేశం నేతలు రేవంత్ రెడ్డి - ఎర్రబెల్లి దయాకర్‌రావు - నామా నాగేశ్వరరావు - రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

చంద్రబాబుతో భేటీ సందర్భంగా రేవంత్ రెడ్డి - ఎర్రబెల్లి దయాకరరావు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఎర్రబెల్లి - రేవంత్ రెడ్డిల మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబుతో భేటీలో రేవంత్ రెడ్డి.. చంద్రబాబు వద్ద తన ఆవేదనను వెల్లగక్కారట. తనను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గుర్తించడం లేదని బాబుకు ఫిర్యాదు చేశారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించినట్లు తెలిసింది. అధికార పార్టీ టీఆర్ఎస్ పైన ఉమ్మడి పోరు సాగిద్దామన్న తన వాదనకు ఏ ఒక్కరు మద్దతు పలకడం లేదన్నారు. సమస్యను పెద్దది చేసుకోవద్దని... మిగతా నేతలతో తాను మాట్టాడుతానని బాబు రేవంత్ కు హా్మీ ఇచ్చినట్లు చెబుతున్నారు.

మరోవైపు ఎర్రబెల్లి, ఇతర నాయకులు రేవంత్ రెడ్డిపై చంద్రబాబుకు కంప్లయింట్లు చేశారు. ఆయనవి ఒంటెత్తు పోకడలని ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబుతో జరిగిన భేటీలో గుండు సుధారాణి అంశం, వరంగల్ ఉప ఎన్నిక కూడా చర్చకొచ్చాయి.