Begin typing your search above and press return to search.
బాబుకు షాక్...ఆయనతో భేటీకి విపక్షాలు నో
By: Tupaki Desk | 19 Nov 2018 1:18 PM GMTఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఊహించని షాక్ తగిలింది. నాలుగేళ్ల పాటు బీజేపీ సారథ్యంలోని మోడీ సర్కారుతో అంటకాగి....సొంత రాష్ట్రంలో అభివృద్ధి చేయలేక ఆ వ్యతిరేకతను తప్పించుకునేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేస్తున్నా అంటూ ప్రకటించుకొని..పర్యటనకు సిద్ధమైన చంద్రబాబుకు షాక్ తగిలింది. ఈ నెల 22న ఏర్పాటు చేసిన ప్రతిపక్షాల సమావేశం వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామం టీడీపీ శ్రేణులను షాక్ కు గురి చేస్తోంది.
2019లో బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటు కోసం కాంగ్రెస్ సహా వివిధ ప్రాంతీయ - జాతీయ పార్టీల నేతలను చంద్రబాబు కలుస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఇప్పటికే చంద్రబాబు కలిశారు. ఈ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ - బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ కోసం ఇప్పటికే చంద్రబాబు కోల్ కతా వెళ్లారు. అయితే, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సమావేశ తేదీపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సోమవారం సాయంత్రం ఆమెను చంద్రబాబు కలిసిన తర్వాత కొత్త తేదీ ప్రకటించనున్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ప్రతిపక్షాల్లో ఆయన ఆశించిన ఐక్యత రావడం లేదు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ - బీఎస్పీ చీఫ్ మాయావతి.. కాంగ్రెస్ ను విమర్శిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్ని పక్షాలు లేకుండా సమావేశానికి మమతా బెనర్జీ అడ్డు చెప్పారు. చత్తీస్ గఢ్ లో సమాజ్ వాదీ పార్టీ అవకాశాలను దెబ్బ తీయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని అఖిలేష్ ఆరోపించగా.. కాంగ్రెస్ - బీజేపీ రెండూ పాముల్లాంటివని బీఎస్పీ చీఫ్ మాయావతి విమర్శించారు. అసలు ఈ మీటింగ్ లో కాంగ్రెస్ ఎలాంటి పాత్ర పోషించబోతుందన్న దానిపై శరద్ పవార్ - మమతా బెనర్జీ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అశోక్ గెహ్లాట్ అమరావతి వెళ్లి చంద్రబాబుతో సమావేశం కావడంపైనా మిగతా పక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
అయితే, దీనిపై టీడీపీ నేతలు కొత్త వాదనను ప్రచారంలో పెట్టాయి. ఈ సమావేశాన్ని జనవరి 19కి వాయిదా వేశారని చెప్తున్నాయి. ఈ సమావేశంలో ఢిల్లీ స్థాయిలో ఒక ఉమ్మడి వేదిక ఏర్పాటు చేసి కేంద్రంపై పోరాట కార్యాచరణ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. లోక్ సభ సాధారణ ఎన్నికల నాటికి ఇది కూటమిగా రూపుదాల్చనుందని అంటున్నారు. ఏది ఏమైనా...ఇది బాబుకు షాక్ వంటిదేనని అంటున్నారు.