Begin typing your search above and press return to search.
రాజ్ భవన్‌కు వెళ్లిన చంద్రబాబు
By: Tupaki Desk | 12 July 2015 4:28 AM GMTఓటుకు నోటు వ్యవహారంలో గవర్నర్ వైఖరికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్ట్ అయినట్లుగా చెబుతారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కంట్రోల్ చేయటంలో గవర్నర్ విఫలం చెందారంటూ ఆయన తన సన్నిహితుల దగ్గర వాపోయినట్లుగా ప్రచారం జరిగింది. దీన్ని నిజం చేస్తూ.. రాజ్‌భవన్‌కు విడిగా వెళ్లి.. గవర్నర్ తో చర్చలు జరిపే పలు ప్రయత్నాల్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రికి నోటీసులు ఖాయమన్న ప్రచారం జోరుగా సాగిన సమయంలో.. గవర్నర్ వైఖరిపట్ల బాబు అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతారు. అయితే.. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రణబ్ గౌరవార్ధం.. గవర్నర్ ఏర్పాటు చేసిన విందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు.
ఆ సమయంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాల మీద ఇరువురి మధ్య చర్చలు జరిగింది లేదు. తాజాగా గోదావరి పుష్కరాలు స్టార్ట్ కానున్న నేపథ్యంలో.. ఈ కార్యక్రమానికి గవర్నర్ హాజరు కావాలంటూ ఏపీ ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి పిలిచినట్లు చెబుతున్నారు. పుష్కరాలకు రావాల్సిందిగా బాబు పలికిన ఆహ్వానానికి గవర్నర్ సానుకూలంగా స్పందించి.. ఒకమాట చెప్పినట్లుగా చెబుతున్నారు.
తాను పుష్కరాలకు ఏపీకి వస్తానని.. కాకుంటే ప్రారంభ సమయంలో హాజరు కావటానికి కుదరని పక్షంలో.. పుష్కరాల చివర్లో అయినా వస్తానని చెప్పినట్లుగా చెబుతున్నారు. ఒకవేళ ఏపీకి రాకుండా తెలంగాణలోని పుష్కర కార్యక్రమానికి హాజరైతే మాత్రం ఏపీ ముఖ్యమంత్రి పరపతికి కాస్తంత ఇబ్బందేనన్న మాటలు వినిపిస్తున్నాయి. మరి.. గవర్నర్ ఏం చేస్తారో చూడాలి.