Begin typing your search above and press return to search.
అవుట్ గోయింగే కానీ ఇన్ కమింగ్ లేదా బాబు?
By: Tupaki Desk | 5 Aug 2016 8:11 AM GMTఇచ్చినమ్మ వాయనం.. పుచ్చుకుంటినమ్మ వాయనం అని మనకో సామెత ఉంది. అందుకు భిన్నమైన దృశ్యం ఏపీ ఎదుర్కొంటోందని చెప్పొచ్చు. కారణం ఏదైనా కావొచ్చు. చేతిలో నుంచి పోవటమే కానీ చేతికి వచ్చేది లేకుండా పోయే పరిస్థితి. ఈ మాటలు మరికాస్త బాగా అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణతో ఇట్టే అర్థమైపోతుంది. ఆంధప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం గుర్తుందా? కోట్లాది రూపాయిలు ఖర్చు పెట్టేసి.. అత్యంత భారీగా కార్యక్రమాన్ని నిర్వహించటంలో ఏపీ ముఖ్యమంత్రి సక్సెస్ అయ్యారు. కోట్లాది రూపాయిలు ఖర్చు చేసినప్పుడు ఆ మాత్రం గ్రాండ్ గా జరగకుండా ఉండదు కదా.
ఇదిలా ఉంటే.. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా ప్రధాని మోడీని ఆహ్వానించారు. అంత పెద్దాయన రాష్ట్రానికి వస్తుంటే తనతో పాటు రాష్ట్రానికి ఏదో ఒక తీపి కబురు తెస్తారని.. సీమాంధ్ర ప్రజల్ని సంతోషంలో ముంచెత్తుతారని చాలానే అంచనాలు నడిచాయి. కానీ.. ఆయన ఒక చెంబులో మట్టి.. మరో చెంబుతో నీళ్లు తీసుకొచ్చి.. ఐదు కోట్ల ఆంధ్రుల ఆశల మీద నీళ్లు చల్లారు. ఆయన పుణ్యమా అని.. ఏపీకి తన వంతు బాధ్యతగా ఏదో ఇవ్వాలని డిసైడ్ అయి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం.. ప్రధాని లాంటి వ్యక్తి కామ్ గా కూర్చుంటే.. తాను ఏదైనా మాట చెబితే.. ఎక్కువ చేసినట్లు ఉంటుందని గమ్మున కూర్చున్న పరిస్థితి. ఇదిలా ఉంటే.. వచ్చినోళ్లను ఉత్త చేతులతో పంపే మర్యాద లేని ముఖ్యమంత్రి వారికి భారీగా కానుకలు ఇచ్చి పంపారు. కానుకలంటే వజ్ర వైఢూర్యాలు కానక్కర్లేదు. విలువైన మెమోంటోలు అయినా డబ్బు లెక్కలోకి వచ్చేదే కదా.
ఇలా.. చిన్నదో చితకదో మన చేతిలో నుంచి ప్రధాని మోడీకి వెళ్లటమే తప్పించి.. ఆయన చేతి నుంచి నలుసంత మట్టి కూడా రాని పరిస్థితి. ఇప్పటికే డజనకు పైగా సార్లు.. ప్రత్యకహోదా అంశం మీద ప్రధాని వారి పరివారంతో చంద్రబాబు భేటీ కావటం.. ఈ సందర్భంగా వారికి భారీ పూలగుత్తి తీసుకెళ్లటం.. మర్యాదగా శాలువా కప్పి రావటం జరుగుతున్న తంతే. ఇన్ని చేస్తున్నా.. మొహమాటం కోసమైనా ఏపీకి ఏదైనా చేశారా అంటే చేసిందేమీ కనిపించదు.
తాజాగా చూస్తే.. కృష్ణా పుష్కరాలకు ఏపీకి రావాలంటూ ప్రధాని మోడీని కలిశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ సందర్భంగా ఆయనకు ఎప్పటి మాదిరే పెద్ద పూలగుత్తి.. మెమోంటో.. భారీ ఆహ్వానపత్రం లాంటివి చేతికి ఇచ్చారు. వాటి విలువ వేలల్లోనే ఉండొచ్చు. కానీ.. ఇలా రూపాయి పోవుడే కానీ.. వచ్చుడన్నది లేని పరిస్థితి. ఇదంతా చూసినప్పుడు అనిపించేది ఒక్కటే.. ఏపీ నుంచి అవుట్ గోయింగే కానీ.. ఇన్ కమింగ్ అంటూ ఏమీ ఉండదా అని.