Begin typing your search above and press return to search.
తగలెట్టిన తర్వాత సంయమన సందేశాలా?
By: Tupaki Desk | 8 Aug 2017 8:02 AM GMTచంద్రబాబునాయుడు చెబుతున్న కొన్ని మాటలను గమనిస్తే.. ఆయనొక శాంతి కాముకుడిలాగా... అపకారికి ఉపకారము చేసే అపర మహానుభావుడిలాగా చూపరులకు అభిప్రాయం కలుగుతుంది. కానీ.. అలాంటి బిల్డప్ ఇవ్వడంలో చంద్రబాబు వ్యూహం - ఆయన తెలివితేటలు లోతుగా గమనిస్తేగానీ అర్థం కావు. తాజాగా చంద్రబాబు పార్టీ శ్రేణులకు ఇస్తున్న సందేశాలను గమనిస్తే ‘ఆహా తనను నడిరోడ్డుపై కాల్చాలని తిట్టిపోసిన ప్రతిపక్షాల మీద కూడా ఆయన ఎంత సాత్వికంగా స్పందిస్తున్నారో కదా’ అనిపిస్తుంది. కానీ.. అందులో ఎంత మతలబు ఉన్నదో లోతుగా చూస్తే తప్ప తెలియదు.
చంద్రబాబునాయుడు పార్టీ నాయకులతో ఓ సమావేశం పెట్టుకున్నారు. ఈ సమావేశంలో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఓ సందేశం ఇచ్చారు. జగన్ నంద్యాల బహిరంగ సభలో తన గురించి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. జగన్ నేరమయ ఆలోచనలకు ఇది నిదర్శనం అంటూ విమర్శలు గుప్పించిన చంద్రబాబునాయుడు.. పార్టీకి మాత్రం చక్కటి సందేశం ఇచ్చారు. నంద్యాలలో ఎటూ మనం గెలుస్తున్నాం. ఓడిపోయే ఫ్రస్ట్రేషన్ లో ప్రతిపక్షాలు మనల్ని రెచ్చగొట్టేలా మాట్లాడినా కూడా.. మనం మాత్రం సంయమనం కోల్పోవద్దు. జాగ్రత్తగా మాట్లాడాలి.. అంటూ ఆయన పేర్కొన్నారు. ‘‘మంచిదే కదా.. ఆయన మంచి మాటే చెప్పారు కదా’’ అనిపిస్తుంది ఎవరికైనా!
కానీ మతలబు ఏంటంటే.. జగన్ బహిరంగ సభ జరిగి ఇప్పటికే చాలా రోజులు గడచిపోయాయి. ఇన్నాళ్లుగా తెలుగుదేశం పార్టీలో మంత్రుల స్థాయి నుంచి ప్రతి గల్లీ లీడరు వరకూ జగన్ ను రకరకాలుగా తిట్టిపోశారు. జగన్ అన్న ఒకే ఒక మాటను పట్టుకుని వారంతా వంద రకాలుగా జగన్ మీద దూషణలపర్వం నడిపించారు. అంతటితో ఆగలేదు. పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మీద జగన్ దిష్టిబొమ్మలను దహనం చేసే ప్రహసనం కూడా పెద్ద ఎత్తున నడిపించారు. ఈ తతంగం కూడా రాష్టమంతా రెండు మూడు రోజుల పాటూ జరిగింది. ఇప్పుడు అంతా సద్దుమణిగిపోయింది.
ఈ సమయంలో చంద్రబాబునాయుడు తన సందేశం వినిపించడానికి తెరమీదకు వచ్చారు. ఇన్నాళ్లూ తన పార్టీ వాళ్లు జగన్ మాటలకంటె ఘోరమైన పదజాలంతో తిరిగి తిట్టిపోయడాన్నీ.. జగన్ దిష్టిబొమ్మలను దహనం చేయడాన్నీ.. అన్ని రకాల దుశ్చర్యలనూ ఆనందంగా ఆస్వాదించి అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన రంగంలోకి వచ్చి.. సంయమనం పాటించడమూ.. శాంతంగా ఉండడమూ గురించి పార్టీకి సందేశం ఇస్తున్నారు. ఇంతకంటె చాణక్యనీతి మరేం ఉంటుందా అని జనం ముక్కున వేలేసుకోవడం సహజమే కదా!