Begin typing your search above and press return to search.
చంద్రబాబు తప్పిదం...ఏపీకి శరాఘాతం?
By: Tupaki Desk | 28 Feb 2020 2:30 PM GMTఅవశేషాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా `40 ఈయర్స్ ఇండస్ట్రీ` నారా చంద్రబాబు నాయుడు 2014లో సీఎం పీఠంపై కూర్చున్న సంగతి తెలిసిందే. అప్పటికే లోటు బడ్జెట్ తో ఆర్థికంగా సతమతమవుతోన్న ఏపీకి పెట్టుబడులు తెస్తానంటూ బాబు గప్పాలు కొట్టారు. అరచేతిలో అమరావతి గ్రాఫిక్స్ చూపించి....విదేశీ పర్యటనలతో కాలం గడిపేశారు. బాబు పర్యటనల వల్ల వచ్చిన అరకొర పెట్టుబడుల కన్నా....ఆయన విదేశీ పర్యటనల ఖర్చు ఎక్కువైందన్న విమర్శలూ వచ్చాయి. ఈ రకంగా ఏపీకి పెట్టుబడులు తేకపోగా...కేంద్రం నుంచి వచ్చే నిధులనూ వినియోగించుకోవడంలో బాబు విఫలమయ్యారు. నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం చేసిన తప్పు...నేడు ఏపీకి ముప్పుగా మారింది. విజన్ 2020 అంటూ సొంత డబ్బా కొట్టుకునే బాబు....ఏమాత్రం విజన్ లేకుండా గుడ్డిగా చేసిన పని ...నవ్యాంధ్ర ప్రజల పాలిట శాపంగా మారింది. 40 ఏళ్ల రాజకీయ అనుభమున్న నాటి సీఎం చంద్రబాబు చేసిన కుట్ర వల్ల ఏపీకి రూ. 3200 కోట్లు నష్టం వాటిల్లే పరిస్థితి వచ్చింది.
చంద్రబాబు అంతటి స్వార్థపరుడైన రాజకీయనేత భారతదేశంలో లేడంటూ ఎన్నో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కేవలం తన రాజకీయ స్వార్థంతో పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.....తన స్వార్థం కోసం రాష్ట్రప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ఓటమి భయంతో 2018 ఆగస్టులో జరగాల్సిన పంచాయతీ ఎన్నికలను బాబు వాయిదా వేయడంతో ఏపీకి రావాల్సిన రూ.3200 కోట్ల నిధులు మురిగిపోయే పరిస్థితి వచ్చింది. కేంద్రం ఇచ్చే నిధుల్లో రూ.3200 కోట్లు రాష్ట్రానికి దక్కకుండా పోయే పరిస్థితి రావడానికి మాజీ సీఎం చంద్రబాబే కారణం. 2020 మార్చి 31లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేకపోతే.. కేంద్రం నుంచి వచ్చే ఈ నిధులు ఆగిపోతాయి. అదే జరిగితే....గ్రామాల అభివృద్ధి కుంటుబడుతుంది.
అయితే, మార్చి 15లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని జగన్ సర్కారు ప్రకటించింది. అయితే, మార్చి 15లోపు...ఆ మాట కొస్తే చివరి డెడ్ లైన్ అయిన మార్చి 31లోపు కూడా ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి ఉంది. దానికి అనేక కారణాలున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటడాన్ని సవాల్ చేస్తూ టీడీపీ నేత బి.ప్రతాప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. అది ఎప్పటికి తేలుతుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. మార్చి 4 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు, మార్చి 23 నుంచి ఏప్రిల్ 10 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి నెలలో ఎన్నికల నిర్వహణకు పాఠశాలలు, విధులు నిర్వహించేందుకు ఉపాధ్యాయులు అందుబాటులో ఉండరు. ఈ నేపథ్యంలో మార్చి 31లోపు ఎన్నికల నిర్వహణ దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది.
గ్రామ పంచాయితీలకు నూరు శాతం గ్రాంట్ మంజూరు చేయాలని 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. దీని ప్రకారం 2018-20 మధ్య రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఏపీకి రూ.4,065.79 కోట్లు కేటాయించారు. తొలి విడతగా రూ.858.99 కోట్లు మంజూరు చేశారు. మిగతా మొత్తం రెండో దఫాలో రావాల్సి ఉంది. అయితే, 2018లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నిధులను మంజూరు చేయ లేదు. మార్చి 31తో 14వ ఆర్థిక సంఘం గడువు ముగిసిపోతుండటంతో.. ఆ తర్వాత ఈ నిధులు ఏపీకి రాకుండా పోయేచాన్స్ ఉంది. ఈ రకంగా నాడు బాబు చేసిన తప్పు నేడు జగన్ పాలిట ముప్పుగా మారింది.