Begin typing your search above and press return to search.
సొంత వాళ్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్న బాబు?!
By: Tupaki Desk | 19 March 2019 8:54 AM GMTతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా గందరగోళ స్థితిలో ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది. ప్రత్యేకించి తను టికెట్లు ఖరారు చేసిన ఇద్దరు నేతలు ఝలక్ ఇచ్చే సరికి బాబుకు మైండ్ బ్లాంక్ అవుతోందని.. టీడీపీ వర్గాలే అంటున్నాయి. ఇప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో బాబుకు అర్థం కాని పరిస్థితి నెలకొందని వారు మీడియాకు ఆఫ్ ద రికార్డుగా సమాచారం అందిస్తున్నారు.
నెల్లూరు రూరల్ టికెట్ ను చంద్రబాబు నాయుడు ఆదాలకు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఆయనేమో తీరా నామినేషన్ వేయాల్సిన టైమ్ లో చేతులు ఎత్తేసి జగన్ పార్టీలోకి చేరిపోయారు. ఇక ఆ షాక్ నుంచి కోలుకోక ముందే..శ్రీశైలంలో బుడ్డా చేతులు ఎత్తేశాడు. ఈయన ఏ పార్టీలోకి చేరలేదు కానీ..తప్పుకున్నాడు. టికెట్ ఖరారు చేసిన తర్వాత తప్పుకున్నాడు!
ఇలా తెలుగుదేశం పార్టీ తొలి జాబితాలోని నేతలు తప్పుకుని.. బాబుకు ఝలక్ ఇచ్చారు. అయితే ఈ కథ ఇంతటితో ఆగుతుందా? అనేది సందేహమే. ఎప్పుడు ఎవరు ఎలాంటి ఝలక్ ఇస్తారో.. అనే భయం మొదలైందట చంద్రబాబునాయుడులో. అందుకే ఇప్పుడు తన సొంత పార్టీ నేతల మీద బాబు నిఘా పెట్టారట. దీని కోసం ఏపీ పోలిస్ విభాగంలోని ఇంటెలిజెన్స్ సేవలను అందుకుంటున్నట్టుగా సమాచారం.
వారిని నియమించి… అనుమానాస్పద నేతలు ఎవరితో మాట్లాడుతున్నారు - ఎవరిని కలుస్తున్నారు… అనే అంశాల గురించి బాబు వాకబు చేస్తున్నారట. అంతే కాదు.. కొంతమంది తెలుగుదేశం నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేసేశారట. ఎవరితో మాట్లాడుతున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. బాబు జాగ్రత్తపడుతూ ఉన్నారట. మొత్తానికి అధికారం చేతిలో ఉన్నా తెలుగుదేశం పార్టీ రాజకీయం చిందరవందరగా మారిన వైనం మాత్రం స్పష్టం అవుతోంది.