Begin typing your search above and press return to search.
ఈ బుర్ర ముందే వాడుంటే...
By: Tupaki Desk | 15 July 2015 5:47 AM GMT కొంచెం ఆలస్యంగానైనా ఏపీ ప్రభుత్వం నిద్రలేచింది. 27 మంది మృతిచెందాక మేలుకొంది. సాంకేతికను ఉపయోగించుకుని ప్రజలకు సమాచారం చేరువ చేసే ప్రయత్నం చేసింది. అయితే... ఈ ప్రయత్నం ముందే చేసుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో తొక్కిసలాట జరిగి, 27 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.... అందరూ ఒకే ఘాట్ కు రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇతర ఘాట్లు కూడా విస్తృతంగా ఉపయోగిస్తే ఒకే ఘాట్ పై అధిక తాకిడి ఉండదు. కానీ అలా జరగలేదు. అయితే... ఇప్పుడు ఏపీ ప్రభుత్వం భక్తులకు ఉపయోగపడేలా ఓ వెబ్ సైట్‌ను లాంచ్ చేసింది. దీని ద్వారా ఏ ఘాట్ వద్ద ఎంతమంది ఉన్నారో తెలుసుకోవచ్చు.
కోటిలింగాల ఘాట్, లక్ష్మీ గణపతి గాట్, కనకదుర్గ ఘాట్, కృష్ణచైతన్య ఘాట్, పుష్కర ఘాట్, టిటిడి ఘాట్, పద్మావతి ఘాట్, విశ్వేశ్వర ఘాట్ తదితర ఘాట్‌ల వద్ద ఎంతమంది ఉన్నారో తెలుసుకోవచ్చు. ఈ విషయమై నారా లోకేష్ కూడా తన ట్విట్టర్ అకౌంటులో ట్వీట్ చేశారు. రాజమండ్రిలో ఏ ఘాట్ వద్ద ఎంతమంది భక్తులు ఉన్నారో తెలుసుకునేందుకు వీలుగా ఏపి ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ఈ వెబ్ పేజీని అందుబాటులోకి తెచ్చారు. ఐఐఐటీ విద్యార్థులు దీనిని రూపొందించారు. ఈ లింక్, వీడియో, విశ్లేషణ ద్వారా ఘాట్లోని యాత్రికుల సంఖ్య చెబుతుంది. దానిని బట్టి భక్తులు ఏ ఘాట్‌కు వెళ్లాలో నిర్ణయించుకోవచ్చు. ఈ వెబ్ లింగ్ ద్వారా ఏపీలోని మిగిలిన ఘాట్‌ల సమాచారం కూడా త్వరలో అందుబాటులోకి రానుంది. కోటి లింగాల ఘాట్ వద్ద ఎక్కువ మంది భక్తులు ఉంటున్నారు. ఆ తర్వాత పుష్కర ఘాట్ వద్ద ఉంటున్నారు.
దీని సహాయంతో భక్తులు ఎక్కడ ఖాళీ ఉందో తెలుసుకుని అక్కడి వెళ్తే అన్ని ఘాట్లకూ జన ప్రవాహం ఒకే తీరుగా ఉండి తొక్కిసలాటలు వంటివి జరగకుండా చూడొచ్చు.