Begin typing your search above and press return to search.
కేసీఆర్ ను జాగ్రత్తగా చూసుకున్నారు
By: Tupaki Desk | 22 Oct 2015 10:16 AM GMTఅమరావతి శంకుస్థాపన వచ్చే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జాగ్రత్తగా చూసుకోవాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే స్పష్టం చేయటం తెలిసిందే. కేవలం మాటల్లోనే కాదు..
చేతల్లో కూడా అంతే జాగ్రత్తను ప్రదర్శించారు చంద్రబాబు. నిజానికి కేసీఆర్ విషయంలో ఒక్క చంద్రబాబు మాత్రమే కాదు.. పలువురు సీమాంధ్ర నేతలు అదే తీరును ప్రదర్శించటం గమనార్హం.
ప్రధానమంత్రి శంకుస్థాపన ప్రాంగణం వద్దకు వచ్చినప్పుడు ఆయనకు స్వాగతం పలికేందుకు వెళ్లిన వారిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉన్నారు. అయితే.. కాస్తంత వెనుకగా ఉన్న ఆయన్ను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయటం.. ఆయనతో మాటలు కలిపే ప్రయత్నం చేయటం కనిపించింది.
కొన్నిసార్లు కేంద్రమంత్రి సుజనా చౌదరి.. మరికొన్ని సార్లు వెంకయ్యనాయుడు..ఇలా ఎవరో ఒకరు కేసీఆర్ ను కలుపుకుపోయేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం.. పలు సందర్భాల్లో కేసీఆర్ కు ప్రాధాన్యత ఇచ్చేందుకు ప్రయత్నించారు. మొత్తంగా చూసినప్పుడు శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన కేసీఆర్ ఏ సందర్భంలోనూ నొచ్చుకోకుండా ఉండేందుకు ఏపీ నేతలు ప్రత్యేక శ్రద్ధ వహించినట్లుగా కనిపించింది.