Begin typing your search above and press return to search.

ఆ 59 కోట్లూ ఎవరికి చేరాయో టీడీపీనే చెప్పాలి!

By:  Tupaki Desk   |   21 Sep 2019 2:30 PM GMT
ఆ 59 కోట్లూ ఎవరికి చేరాయో టీడీపీనే చెప్పాలి!
X
పోలవరం రివర్స్ టెండరింగ్ వ్యవహారంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. రివర్స్ టెండరింగ్ విషయంలో గగ్గోలు పెట్టిన వాళ్లు ఇప్పుడు మొహాలు ఎక్కడ పెట్టుకుంటారు? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతూ ఉంది. పోలవరం పనుల్లో ఒక చిన్న డివిజన్ కు సంబంధించే 59 కోట్ల రూపాయల డబ్బు ప్రభుత్వాన్ని సేవ్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. రివర్స్ టెండరింగ్ లో ఇంత భారీ మొత్తం సేవ్ అవుతూ ఉండటం గమనార్హం.

ఇదే సమయంలో గమనించాల్సిన మరో అంశం ఏమిటంటే.. చంద్రబాబు హయాంలో ఏ సంస్థ అయితే ఈ టెండర్ పొందిందో - రివర్స్ టెండరింగ్ లో అదే సంస్థ అంతకన్నా 59 కోట్ల రూపాయల తక్కువ ధరను కోట్ చేయడం గమనార్హం.

చంద్రబాబు హయాంలో ఈ ప్యాకేజ్ పనుల మొత్తం విలువ 290 కోట్ల రూపాయలకు అంచనా వేశారు. మాక్స్ ఇన్ ఫ్రా అనే సంస్థ ఈ ధరకు ఆ పనులు సొంతం చేసుకుంది. అయితే ఆ అంచనా వ్యయాన్ని జగన్ ప్రభుత్వం తగ్గించి వేసింది. 274 కోట్ల రూపాయల ధరకు టెండర్లను పిలించింది ప్రభుత్వం. అయితే మాక్స్ ఇన్ ఫ్రా 231 ఒక్క కోట్ల రూపాయలకు ఈ పనులు చేయడానికి ముందుకు వచ్చింది. దీంతో ఓవరాల్ గా రివర్స్ టెండరింగ్ తో 59 కోట్ల రూపాయల వరకూ సేవ్ అయ్యింది.

ఇలా రివర్స్ టెండరింగ్ తో జగన్ ప్రభుత్వం ఘన విజయం నమోదు చేసింది. ఇప్పడు వచ్చే మరో సందేహం ఏమిటంటే.. ఇంతకీ ఆ 59 కోట్ల రూపాయల కథేంటి? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంచనాలను అంత భారీగా ఎందుకు వేసింది? ఆ 59 కోట్ల రూపాయలూ.. ఎవరి కమిషన్లుగా వెళ్లేవి? అప్పుడూ - ఇప్పుడూ ఒకే సంస్థ తన కోట్స్ లో అంత వ్యత్యాసం చూపడానికి కారణం .. కమిషన్లేనా? అప్పుడు కమిషన్లు ఇచ్చుకోవాల్సి రావడం - ఇప్పుడు అలాంటి బెడద లేకపోవడంతో.. అదే సంస్థ తక్కువ ధరకు పోలవరం పనులు చేసేందుకు ముందుకు వచ్చిందనేది నిరూపితం అవుతున్న సత్యమే కదా!