Begin typing your search above and press return to search.
భావోద్వేగ రాజకీయాలు బాబు షురూ చేశారా?
By: Tupaki Desk | 27 July 2015 4:00 AM GMTభావోద్వేగ రాజకీయాల్ని నడపటం అంత తేలికైన విషయం కాదు. పులి మీద స్వారీ లాంటిది. ఒకసారి స్వారీ మొదలుపెడితే.. అదలా కంటిన్యూ కావాల్సిందే తప్ప.. మధ్యలో దిగటం అంటే.. పులి నోటికి చిక్కటమే. భావోద్వేగ రాజకీయాల్లో లాభం ఎంత ఉంటుందో... అంతే రిస్క్ ఉంటుంది.
కానీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం అందుకు భిన్నమైన రాజకీయ ఎత్తుగడను షురూ చేశారు. భావోద్వేగమైనప్పటికీ.. తనకెలాంటి నష్టాన్ని కలిగించని ఆట ఒకటి బాబు మొదలు పెట్టినట్లుగా కనిపిస్తోంది.ఇందుకు గత రెండు రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలే నిదర్శనంగా చెప్పొచ్చు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో జరిపిన పాదయాత్రను ఉద్దేశించి బాబు వ్యాఖ్యల్ని చూస్తే.. చేసిన గాయాన్ని ఇంకా కెలకాలని చూస్తున్నట్లే ఉంది తప్పించి.. ఏపీ ప్రజలకు సాంత్వన కలిగించేలా లేదంటూ విరుచుకుపడటం కనిపిస్తుంది.
చంద్రబాబు మనస్తత్వానికి.. ఆయన నోటి నుంచి రెగ్యులర్ గా వచ్చే మాట లకు.. ఇలాంటి మాటలు అస్సలు నప్పవు. కానీ.. అందరిని ఆకట్టుకునేలా.. ఏపీ ప్రజల్లో భావోద్వేగాన్ని రగల్చటానికి బాబు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. తనకెంత మాత్రం సూట్ కాని ఎమోషనల్ డైలాగుల్ని ఈ మధ్యన బాబు చెబుతున్నారు.
అయితే.. ఈ వ్యాఖ్యల్లో మరింత పరిణితి అవసరం. రాహుల్ మీద చేసిన వ్యాఖ్యలు భావోద్వేగాల్ని తట్టిలేపేలా ఉన్నప్పటికీ.. దానికి కొనసాగింపు ఏమీ లేకపోవటం గమనార్హం. అయితే.. ఆయన ప్రసంగంలో మార్పు మొదలైందన్న సంకేతం తెలుగు తమ్ముళ్లలో హుషారు పుట్టిస్తుందని చెప్పక తప్పదు.
రాహుల్ గాంధీ పర్యటన మీద వేసిన కౌంటర్ తోపాటు.. రాజమండ్రి నగర పేరును మార్చే విషయంలో సమయానికి తగ్గట్లుగా నిర్ణయం తీసుకున్నారు. చరిత్ర పుటల్లో ఉండిపోయిన రాజమహేంద్రవరం పేరును తెరపైకి తీసుకొచ్చి.. రాజమండ్రి పేరును మార్చేస్తామని చెప్పటం ద్వారా.. గోదావరి జిల్లాల ప్రజలను రంజింపజేశారు. అమరావతి పేరు పెట్టడం కూడా ఇలాంటిదే.
గతంలో తొమ్మిదిన్నరేళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు అస్సలు కనిపించవు. అందుకు భిన్నంగా తాజాగా బాబు నిర్ణయాలు ఉండటం గమనార్హం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. భావోద్వేగ పులి మీద స్వారీ కాకుండా.. సేఫ్ జర్నీ లాంటి అంశాల మీదనే తన దృష్టిని కేంద్రీకరించినట్లు కనిపిస్తోంది. తనకేమాత్రం అలవాటు లేని ఒక కొత్త విధానాన్ని బాబు షురూ చేశారని చెప్పక తప్పదు.