Begin typing your search above and press return to search.

ఏపీ మంత్రులకు శాఖల ఖరారు..

By:  Tupaki Desk   |   3 April 2017 11:53 AM GMT
ఏపీ మంత్రులకు శాఖల ఖరారు..
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రులుగా నిన్న ప్ర‌మాణ స్వీకారం చేసిన మంత్రుల‌కు ఈ రోజు శాఖ‌ల కేటాయింపు జ‌రిగింది. అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న యువ‌నేత‌ నారా లోకేశ్ కి ఐటీ - పంచాయ‌తీ రాజ్‌ - గ్రామీణాభివృద్ధి శాఖ‌ను కేటాయించారు. ఇంతవరకు ఆ శాఖను అయ్యన్నపాత్రుడు చూసేవారు.. ఆయనకు ఇప్పుడు రోడ్లు భవనాల శాఖ ఇచ్చారు. చంద్రబాబు వద్ద చాలాకాలంగా ఉంటూ... అధికారికంగా సభలు - సమావేశాలు - ఇతర వ్యవహారాలకు అచ్చెన్నాయుడిని పంపిస్తున్న విద్యుత్ శాఖను కళావెంకటరావుకు అప్పగించారు. అచ్చెన్నాయుడికి కార్మిక శాఖ బాధ్యతలనుంచి తప్పించి రవాణా - బీసీ సంక్షేమం - చేనేత శాఖలిచ్చి ప్రాధాన్యం పెంచారు. ఇంతవరకు బీసీ సంక్షేమం చూసిన కొల్లు రవీంద్రకు న్యాయ శాఖ ఇచ్చారు .. కొత్తవారిలో సుజయ కృష్ణ రంగారావుకు కీలకమైన గనుల శాఖ ఇచ్చారు. ఒకవైపు పదవులు రానివారు తీవ్ర నిరసనలు వ్యక్తంచేస్తున్న తరుణంలోనే చంద్రబాబు కొత్త మంత్రులకు శాఖలిచ్చారు. అదే సమయంలో పాతవారిలోనూ పలువురికి శాఖలు మార్చారు.


నారా చంద్రబాబునాయుడు: ముఖ్యమంత్రి - మౌలిక సదుపాయాలు - పెట్టుబడులు - మైనారిటీ సంక్షేమం-ఉపాధి - సినిమాటోగ్రఫీ

మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు

టీడీపీ కోటా

కే.ఈ. కృష్ణమూర్తి: ఉపముఖ్యమంత్రి - రెవెన్యూ - స్టాంపులు - రిజిస్ట్రేషన్ల శాఖలు

నిమ్మకాయల చినరాజప్ప: ఉపముఖ్యమంత్రి - హోం - విపత్తు నిర్వహణ శాఖలు

యనమల రామకృష్ణుడు: ఆర్థిక - ప్రణాళిక - వాణిజ్య పన్నులు - శాసనసభా వ్యవహారాలు

నారా లోకేష్‌: ఐటీ - పంచాయతీరాజ్‌ - గ్రామీణాభివృద్ధి

కిమిడి కళా వెంకట్రావు: ఇంధనశాఖ

కింజరాపు అచ్చెన్నాయుడు: రవాణా - బీసీ సంక్షేమం - చేనేత - జౌళిశాఖ

సీహెచ్‌. అయ్యన్నపాత్రుడు: రోడ్లు - భవనాల శాఖ

గంటా శ్రీనివాసరావు: మానవవనరుల అభివృద్ధి - ప్రాథమిక - మాధ్యమిక - ఉన్నత విద్యా శాఖ

కొత్తపల్లి శామ్యూల్‌ జవహర్‌: ఎక్సైజ్‌శాఖ

పితాని సత్యనారాయణ: కార్మిక - ఉపాధి - శిక్షణ - పరిశ్రమలు శాఖ

కొల్లు రవీంద్ర: క్రీడలు - న్యాయ - నైపుణ్యాభివృద్ధి - యువజన సర్వీసులు - ఎన్‌ఆర్‌ఐ సంబంధాల శాఖ

దేవినేని ఉమా మహేశ్వరరావు: జల వనరుల శాఖ

నక్కా ఆనంద బాబు: సామాజిక - గిరిజన సంక్షేమం

ప్రత్తిపాటి పుల్లారావు: ఆహార - పౌరసరఫరాలు - వినియోగదారుల వ్యవహారాలు - ధరల నియంత్రీకరణ

శిద్దా రాఘవరావు: అటవీ - వాతావరణ - శాస్త్ర సాంకేతిక

పొంగూరు నారాయణ: పురపాలక - పట్టణాభివృద్ధి

సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి: వ్యవసాయం.. అనుబంధ శాఖలు - ఉద్యానశాఖ

కాలవ శ్రీనివాసులు: గ్రామీణ గృహ నిర్మాణం - సమాచార - పౌర సంబంధాలు

పరిటాల సునీత: సెర్ప్‌ - మహిళా శిశు సంక్షేమం - దివ్యాంగుల - వృద్ధుల సంక్షేమం

వైసీపీ కోటా :

వెంకట సుజయ్‌ కృష్ణ రంగారావు: భూగర్భ - గనుల శాఖ

భూమా అఖిల ప్రియ: పర్యాటకం - తెలుగు భాష - సంస్కృతి

ఎన్‌ అమరనాథ్‌ రెడ్డి: పరిశ్రమలు - ఆహార - వ్యవసాయ ఉత్పత్తులు - పబ్లిక్‌ ఎంటర్‌ ప్రైజెస్‌

ఆదినారాయణరెడ్డి: మార్కెటింగ్‌ - పశుసంవర్థక - మత్స్య శాఖ

బీజేపీ కోటా :

కామినేని శ్రీనివాసరావు: ఆరోగ్య - వైద్య విద్య శాఖ

పైడికొండల మాణిక్యాల రావు: దేవాదాయ శాఖ