Begin typing your search above and press return to search.

ఇంద్ర‌భ‌వ‌నాన్ని త‌ల‌పించేలా బాబుగారి మ‌హాల్‌

By:  Tupaki Desk   |   9 April 2017 5:51 AM GMT
ఇంద్ర‌భ‌వ‌నాన్ని త‌ల‌పించేలా బాబుగారి మ‌హాల్‌
X
పేద‌రిక‌పు మాట‌లుచాలానే చెబుతుంటారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. సుదీర్ఘ‌కాలంగా రాజ‌కీయాల్లోఉన్న‌ప్ప‌టికీ.. ఏదో పాలు.. పెరుగు.. కూర‌గాయ‌లు.. చింత‌పండు కందిపప్పు అమ్ముకునే వ్యాపారం.. రెండు మూడు ఇళ్లు త‌ప్పించి మ‌రింకేమీ లేన‌ట్లుగా చెబుతుంటారు. సింఫుల్ జీవితాన్ని తాను ఇష్ట‌ప‌డుతున్నట్లుగా మాటలు చెబుతుంటారు. ఆయ‌న మాట‌ల్లో నిజం ఎంత‌న్న‌ది హైద‌రాబాద్ లో నిర్మించిన ఇంద్ర భ‌వ‌నాన్ని త‌ల‌పించే న‌యా మ‌హ‌ల్ ను చూస్తే బాబుఎంత సింఫుల్ అన్న విష‌యం తెలిసిపోతుంది.

అత్యంత సంప‌న్నులు మాత్రమే నివ‌సించే జూబ్లీహిల్స్ రోడ్ నెంబ‌రు65లో.. బాబు ఇల్లు ఉండేద‌న్న‌ది తెలిసిందే. మారిన కాలానికి.. పెరిగిన అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్లుగా ఇల్లు లేద‌న్న ఉద్దేశంతో కొన్ని నెల‌ల క్రితం ఆ ఇంటిని కూల్చేసి.. దాని స్థానంలో కొత్త ఇంటి నిర్మాణాన్ని చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అర ఎక‌రం విస్తీర్ణంలోక‌ళ్లు చెదిరేలా.. కోట్లాదిరూపాయిల్ని మంచినీళ్ల ప్రాయంగా ఖ‌ర్చు చేసి నిర్మించిన రాజ మ‌హాల్ లాంటి ఇంటి గృహ‌ప్ర‌వేశం తాజాగా జ‌ర‌గ‌నుంది. కుటుంబ‌స‌భ్యులు.. ఎంపిక చేసిన అతి కొద్దమంది స‌న్నిహితులు మిన‌హా మిగిలిన వారెవ‌రికీ ఎంట్రీ లేని ఈ ఇంటి ముచ్చ‌ట్లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి.

పెద్ద ఎత్తున పోలీసు బ‌ల‌గాల‌తో నింపేసిన‌.. ఈ ఇంటికి వెళ్ల‌టం అంత తేలికైన విష‌యం కాదు. ఇక‌.. ఆ ఇంట్లోని విశేషాలు తెలుసుకునేందుకు చాలానే క‌ష్ట‌ప‌డాలి. ఇంటికిసంబంధించిన విష‌యాల్ని చంద్ర‌బాబు గుట్టుగా దాచేసినా.. ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ ఆ ఇంట్లోని విశేషాల్ని బ‌య‌ట‌పెట్టింది.

అత్యంత విలాస‌వంతంగా.. ఆధునాత‌నంగా ఇంటిని తీర్చి దిద్దిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ ఇంటిని ఎంత గ్రాండ్ గా నిర్మించార‌న్న విష‌యానికి ఒకే ఒక్క ఉదాహ‌ర‌ణ‌తో విష‌యం మొత్తం అర్థ‌మ‌వుతుంద‌ని చెబుతూ.. ఇంటి ఇంటీరియ‌ర్ కోసం బాబు ఫ్యామిలీ ఇట‌లీకి నాలుగుసార్లు వెళ్లి వ‌చ్చింద‌న్న మాట‌ను చెబుతున్నారు. అర ఎక‌రం విస్తీర్ణంలో ఇర‌వైవేలకుపైగా చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ విలాస‌వంత‌మైన ఇంటిని ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా ఖ‌ర్చుచేసిన‌ట్లుగా చెబుతున్నారు. విదేశీ నిపుణుల సూచ‌న‌తో అత్యంత విశాల‌మైన బెడ్రూం.. రెస్ట్ రూమ్ ల‌తో పాటు.. లాన్ ను ప్ర‌త్యేకంగా రూపొందించిన‌ట్లుగా చెబుతున్నారు. యూర‌ప్ దేశాల నుంచి తీసుకొచ్చిన‌ఖ‌రీదైన క‌ళాఖండాల‌తో ఇంటిని నింపిన‌ట్లుగా తెలుస్తోంది.

మూడుఅంత‌స్తుల్లో నిర్మించిన ఈ ఇంటిని 20,383 చ‌ద‌ర‌పు అడుగుల నిర్మాణం కోసం కోట్లాది రూపాయిల్ని ఖ‌ర్చుచేశార‌ని.. స్టిల్ట్ ఫ్లోర్ లో ఏకంగా 19 కార్ల‌ను పార్క్ చేసే వెసులుబాటు ఉంద‌నంటున్నారు. ఇక‌.. ఆధుతాన‌త లిఫ్ట్ లు.. వీఐపీ లాంజ్ లు.. డైనింగ్ హాళ్లు..స్ట‌డీ.. లైబ్ర‌రీల కోసం ప్ర‌త్యేక సామాగ్రిని వినియోగించిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ ఇంటి కోసం విదేశీ డిజైన‌ర్లు ప‌ని చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

మ‌రింత విలాస‌వంత‌మైన ఇంటి విష‌యంలోనూ బాబు మార్క్ ఒక‌టి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు. బాబు పేరు ప‌లికినంత‌నే ఏదో ఒక వివాదంతో ముడిప‌డి ఉంటుంది. తాజాగా నిర్మించిన ఈ ఇల్లు కూడా అదే ఖాతాలో ఉంద‌న్న మాట వినిపిస్తోంది. నిబంధ‌న‌ల ప్ర‌కారం జూబ్లీహిల్స్ ఏరియాలో భ‌వ‌న నిర్మాణాన్ని 10 మీట‌ర్ల ఎత్తుకు నిర్మించ‌కూడ‌ద‌న్న రూల్ ఉన్నా.. అందుకు విరుద్దంగా 13 మీట‌ర్ల ఎత్తుతో ఇంటిని నిర్మించిన‌ట్లుగా తెలుస్తోంది. సోమ‌వారం స‌త్య‌నారాయ‌ణ వ‌త్రం జ‌రుగుతుంద‌ని చెబుతున్న ఈ ఇంటి ఓసీ (అక్యుపెన్సీ స‌ర్టిఫికేట్‌)కోసం ద‌ర‌ఖాస్తు చేయ‌లేద‌న్న మాట వినిపిస్తోంది. రూల్స్ ను అతిక్ర‌మించి నిర్మించిన ఈ రాజ‌మ‌హ‌ల్ మ‌రో వివాదంగా బాబుకు చుట్టుకోవ‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/