Begin typing your search above and press return to search.
చంద్రబాబు కొత్త ఇంట్లో ఎన్ని విశేషాలో...
By: Tupaki Desk | 10 Aug 2016 1:21 PM GMTసింపుల్ సిటీకి చిరునామాగా ఉండే ఏపీ సీఎం చంద్రబాబు.. తన కుటుంబ అవసరాల కోసం హైదరాబాద్‌లో ఓ పెద్ద భవనాన్నే నిర్మించుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన పాత భవనాన్ని కూలగొట్టి దాని స్థానంలో ఆయన నూతన భవనం నిర్మించుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, దీనికి సంబంధించిన పలు ఆసక్తి కర విషయాలు తాజాగా వెలుగు చూశాయి. అది కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించిన దాని ప్రకారం.. చంద్రబాబు నూతన ఇంటి విస్తీర్ణం.. 20 వేల చదరపు అడుగులని తెలిసింది. 19,737 చదరపు అడుగుల్లో నిర్మాణం కోసం హైదరాబాద్ కార్పొరేషన్‌కు ఆయన దరఖాస్తు చేసుకున్నారు.
దీంతో జీహెచ్ఎంసీ అనుమతులు మంజూరు చేసింది. ఈ నిర్మాణం కేవలం జీ ప్లస్ 1 వరకే పరిమితమైంది. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్న సమయంలో అత్యంత ఇరుకైన నివాసంలో ఉన్నానని, నలుగురొస్తే ఇబ్బందిగా ఉండేదని పదే పదే చెప్పిన చంద్రబాబు.. బహుశ ఆ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే ఉన్న భవనాన్ని కూలగొట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు నిర్మిస్తున్న ఇంటిని సువిశాలంగా ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. అదేవిధంగా నలుగురు కాదు దాదాపు 50 మంది వచ్చినా కూడా సరిపోయేలాగా, అధికారులతో సమీక్షలు నిర్వహించుకునేందకు వీలుగా, టీడీపీ నేతలతో భేటీ అయ్యేందుకు అనువుగా కూడా ఈ నివాసం ఉంటుందని అంటున్నారు.
ఇక, చంద్రబాబుకు ఎంతో ఇష్టమైన పచ్చదనానికి ఈ ఇల్లు పెద్ద పీట వేయనుంది. ఇంటి ఆవరణలో చుట్టూ.. భారీ ఎత్తున పచ్చదనానికి చోటు కల్పిస్తున్నారు. కేవలం పచ్చదనం కోసమే దాదాపు 200 చదరపు గజాల స్తలాన్ని కేటాయించారని తెలుస్తోంది. అదేవిధంగా ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలకు కూడా ప్రాధన్యం ఇవ్వనున్నారు. ఇక, ఈ స్థలం విలువ విషయానికి వచ్చేసరికి.. దాదాపు 10 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. ప్రస్తుత మార్కెట్ విలువ ఇది. కానీ, దీనిని గతంలోనే కొనుగోలు చేశారు.