Begin typing your search above and press return to search.
వీరే చంద్రబాబు కొత్త అస్త్రాలు!
By: Tupaki Desk | 7 April 2018 1:30 PM GMTఎంతకాలమూ తిట్టేవారూ మారకుండా.. తిట్టబడే వారూ మారకుండా ఉంటే ఏం మజా ఉంటుంది. రెండురోజుల తర్వాత.. ఎన్ని తిట్టినా.. ప్రజలు వాటిని పట్టించుకోవడం మానేస్తారు కదా...! అందుకే చంద్రబాబునాయుడు తన రాజకీయ ప్రత్యర్థి పార్టీల మీద కొత్త అస్త్రాలను తయారుచేసి ఎక్కు పెడుతున్నట్లుగా కనిపిస్తోంది. అఖిలపక్షం రెండో సమావేశం శనివారం జరిగిన నేపథ్యంలో సమావేశానికి రాని పార్టీల సంగతి ప్రజలు చూసుకుంటారు.. ఆయా పార్టీల సంగతి ప్రజలే తేల్చుకుంటారు.. అంటూ.. వారికి ఓ హెచ్చరిక చేయడానికి అచ్చంగా పచ్చ దళం సభ్యుడు కాకపోయినప్పటికీ.. సినీ నటుడు శివాజీ వంటి అస్త్రాలు చంద్రబాబుకు అందిరావడమే తాజా పరిణామం.
మామూలు ప్రాతిపదికన చూసినట్లయితే.. చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత.. నిర్వహించిన అఖిలపక్ష సమావేశం అనేది.. తొలి సమావేశం కంటె అత్యంత దారుణంగా విఫలం అయింది. లోక్ సత్తా అనేది కూడా పార్టీ రూపంలో అస్తిత్వంలో ఉన్నట్లు ఒప్పుకునేట్లయితే వారు, మరియు ఏఐఎఫ్ బీ- ఆర్ ఎస్ పీ వంటి ఊరూపేరూ తెలియని పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. వాటితో పాటు.. కొన్ని ఉద్యోగ సంఘాలు - రాష్ట్ర హక్కుల కోసం పోరాడే సంఘాల ప్రతినిధులు కూడా వచ్చారు.
రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ - భాజపా - కాంగ్రెస్ - జనసేన - వామపక్ష్లాలు ఎవ్వరూ లేకుండానే.. వచ్చిన వాళ్లకి చంద్రబాబు తన ఢిల్లీ యాత్ర విశేషాలు వివరించారు. వచ్చిన వారిలో హీరో శివాజీ.. రాని పార్టీల చిత్తశుద్ధి గురించి.. సందేహాలు కలిగేలా వ్యాఖ్యలు చేయడం విశేషం. అయిదు కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం సమైక్య పోరాటం కోసం.. రాష్ట్రంలోని అన్ని పార్టీలను ఆహ్వానించిందని.. ఈ భేటీకి రాని పార్టీల సంగతి ప్రజలే చూసుకుంటారని శివాజీ అన్నారు. ఒకప్పుడు భాజపాలో పనిచేసిన శివాజీ.. తర్వాత.. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా.. ఏపార్టీకి సంబంధంలేకుండా స్వతంత్రంగానే పోరాడుతుండడం విశేషం. తాజాగా ఆయన చంద్రబాబు అస్త్రంగా మారినట్లుగా కనిపిస్తోంది.