Begin typing your search above and press return to search.
చంద్రబాబుకి తలనొప్పిగా మారిన లోకేష్ సీటు
By: Tupaki Desk | 22 Feb 2019 6:02 AM GMTవచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందా - రాదా. ఓటు కు నోటు కేసు ఏమౌవుతుందో.. ఇలాంటి భయాలు కూడా చంద్రబాబుని ఏం చేయలేదు. కానీ వచ్చే ఎన్నికల్లో లోకేష్‌ని బరిలోకి దింపాలా వచ్చా ఆనే విషయంలో మాత్రం ఆయన తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఒకవేళ బరిలోకి దింపితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలి అనే విషయంలో కూడా ఎలాంటి క్లారిటీకి రాలేకపోతున్నారు చంద్రబాబునాయుడు.
లోకేష్ ప్రసుతం ఎమ్మెల్సీగా ఉన్నాడు. అయితే ఎన్నాళ్లు. ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి రాజకీయాల్లోకి రాకపోతే.. ఎప్పటికీ దిగకపోతే ఎప్పటికీ నాయకుడు కాలేదు. అందుకే.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే లోకేష్ ని ఎమ్మెల్యేగా పోటీ చేయించి గెలిపించాలని పావులు కదుపుతున్నారు చంద్రబాబు. అయితే బరిలోకి అంటూ దింపితే కచ్చితంగా గెలవాలి లేకపోతే పరువు పోతుంది. అందుకే.. గ్యారంటీగా గెలిచే నియోజకవర్గాల్ని వెతికే పనిలో ఉన్నారు చంద్రబాబు.
మొదట కుప్పం నుంచి పోటీ చేయించాలని భావించారు కానీ అక్కడి నుంచి మళ్లీ చంద్రబాబే పోటీలోకి దిగబోతున్నారు. దీంతో.. లోకేష్ కు కుప్పం సీట్ మిస్ అయ్యింది. మంగళగిరి నుంచి పోటీ చేయించాలని భావించారు. రాజధాని రావడంతో.. అక్కడి రైతులు - ప్రజలు ఆనందంగా ఉన్నారు. అవన్నీ ఓట్లుగా మారతాయని తెలిసినా.. నెగిటివ్ ఓటింగ్ జరిగితే మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఉంది. ఇక గుంటూరు జిల్లా పెదకూరపాడులో కమ్మ ఓటింగ్ చాలా ఎక్కువ. దీంతో.. అక్కడినుంచి పోటీ చేయించాలనే ఆలోచన ఉంది. ఈ రెండూ కాకుండా కృష్ణా జిల్లాలోని పెనుమలూరు నియోజకవర్గం కూడా పరిశీలనలో ఉంది. ఏదిఏమైనా కృష్ణా - గుంటూరు జిల్లాల నుంచే లోకేష్ ని బరిలోకి దించాలని భావిస్తున్నారు. మరి ఇప్పుడు లోకేష్ కోసం త్యాగరాజుగా మారుతున్న ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరో.