Begin typing your search above and press return to search.
బుట్టాకు సీటే లేని పరిస్థితి.?
By: Tupaki Desk | 25 Feb 2019 8:48 AM GMTకర్నూల్ ఎంపీ బుట్టా రేణుక పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. వైసీపీ నుంచి కర్నూల్ ఎంపీగా గెలుపొందిన బుట్టా రేణుక ఆ తరువాత జరిగిన పరిణామాలతో ఆ పార్టీకి దూరంగా ఉంటూ టీడీపీకి సన్నిహితంగా ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే అనధికారికంగా టీడీపీలో చేరిపోయారు. అయితే ఇప్పుడు ఆమె రాజకీయ భవిష్యత్ ను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నార్థకంలో పడేశారు.
2014 ఎన్నికల్లో బుట్టా రేణుక వైసీపీ నుంచి ఎంపీగా గెలుపొందారు. అయితే వైసీపీ ప్రతిపక్ష పార్టీకే పరిమితమయింది. తదనంతర పరిణమాలతో టీడీపీ అధికారంలో ఉండటంతో ఎంపీ రేణుక తన భర్తను ముందుగా టీడీపీలోకి పంపించారు. తాను టీడీపీకి వెళితే పార్టీ ఫిరాయింపు కిందకు వస్తుందని భావించి వైసీపీకి దూరంగా ఉంటూ టీడీపీకి అనుబంధ సభ్యురాలిగా మారిపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ కర్నూల్ ఎంపీగా పోటీ చేస్తాననే ధీమాతో ఉన్నారు. అందుకోసం చినబాబు లోకేష్ మద్దతు కూడా కూడబెట్టారు. అయితే కొద్దరోజులుగా కర్నూల్ ఎంపీ సీటుకు తనకు ఇవ్వడం కూదరదని చెప్పినట్లు టీడీపీ నుంచి సిగ్నల్స్ వస్తున్నాయట..
ఇటీవల చంద్రబాబు నాయుడు మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబ సభ్యులను పార్టీలోకి ఆహ్వనించిన సంగతి తెల్సింది. ఈనెల 28న వారు పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. ఈమేరకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి కర్నూల్ ఎంపీ స్థానం - ఆయన భార్య కోట్ల సూజాతమ్మకు ఆలూరు అసెంబ్లీ టికెట్ ఆఫర్ చేశారు. దీంతో ఎంపీ బుట్టా రేణులు ఆశలన్నీ ఆవిరయ్యాయి.
చినబాబు లోకేష్ కూడా కర్నూల్ ఎంపీ టికెట్ బుట్టా రేణుక ఇవ్వాలని అడిగినా చంద్రబాబు ససేమిరా అన్నట్లు తెల్సింది. కాగా ఎంపీ టికెట్ రాకపోతే ఎమ్మినూర్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలని బుట్టారేణుక భావించారు. అయితే ఆ సీటు కాకుండా ఆదోని ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చంద్రబాబు సూచించారని తెలిసింది. అదికూడా కచ్చితమైన హామీ ఇవ్వలేదట. అక్కడ మాజీ ఎమ్మెల్సే మీనాక్షి నాయుడు - బుట్టా రేణుకలపై సర్వే జరుగుతుందని సర్వే ఎవరికీ అనుకూలంగా వస్తే వారికే సీటు అని తెగేసి చెప్పారట. దీంతో అసెంబ్లీ టికెట్ కూడా దక్కే అవకాశం కనిపించడం లేదు.
చంద్రబాబు తీరుతో బుట్టా రేణుక అసంతృప్తితో ఉన్నారని సమాచారం.. కర్నూల్ ఎంపీ టికెట్ ఇస్తే తన వ్యాపారాల రీత్యా బాగుంటుందని అదే ఎమ్మెల్యే అయితే నియోజకవర్గానికి పరిమితం కావాల్సి వస్తుందని ఆమె సన్నిహితుల వద్ద వాపోతున్నారు. అయితే కర్నూలు ఎంపీగా పోటీ చేసేందుకే ఆమె మెగ్గు చూపుతున్నారట. ఈ నేపథ్యంలో తన అనుచరులతో భేటి అయినట్లు సమాచారం. ఈసారి రేణుక ఎంపీగా పోటీ చేస్తారా? లేక ఎమ్మెల్యేకా అనేది ఇంకా తేలాల్సి ఉంది. బాబు ఇచ్చిన స్ట్రోక్ కు అసలు సీటుదక్కతుందా లేదా అన్న టెన్షన్ బుట్టాను పట్టిపీడిస్తోందట..