Begin typing your search above and press return to search.

రెడ్డి నేతలను పక్కన పెట్టేస్తున్న చంద్రబాబు!

By:  Tupaki Desk   |   13 Feb 2019 8:38 AM GMT
రెడ్డి నేతలను పక్కన పెట్టేస్తున్న చంద్రబాబు!
X
తెలుగుదేశం పార్టీలో చాలా మంది రెడ్డి సామాజికవర్గం నేతలున్నారు. ఏపీలో బలీయమైన రాజకీయ శక్తి అయిన రెడ్డి సామాజికవర్గం నేతలు తెలుగుదేశంలోనూ చాలా మంది ఉన్నారు. ఇటీవలే ఆ పార్టీ లోకి చాలా మంది చేరారు కూడా. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఎమ్మెల్యేలను ఫిరాయింపుజేయడం విషయంలో రెడ్డి సామాజికవర్గం నేతల మీదే చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టాడు కూడా. వారిలో ముగ్గురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు.

అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో రెడ్డి సామాజికవర్గం నేతలకు చాలా వరకూ ప్రాధాన్యత తగ్గిపోతోందని సమాచారం. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వారిని బాబు పూర్తిగా పక్కన పెడుతున్నాడని టాక్.

తాజాగా ఢిల్లీ లో చంద్రబాబు దీక్ష వ్యవహారం కూడా అందుకు నిదర్శనంగా సాగుతూ ఉంది. ఢిల్లీలో చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్షలో పాల్గొనడానికి చాలా మంది తెలుగుదేశం పార్టీ రెడ్డి నేతలు వెళ్లారు. అయితే వారికి దీక్షా శిబిరంలో ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు.

జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్లకు కూడా అక్కడ చోటు దక్కినట్టుగా లేదు. తెలుగుదేశం ఎంపీలే అక్కడే హడావుడి చేశారు. అయితే జేసీ లాంటి వాళ్ల ఊసు అక్కడ లేకుండా పోయింది. ఆపై చంద్రబాబు నాయుడు రాష్ట్రపతిని కలిసిన సమయంలో.. తెలుగుదేశం పార్టీ రెడ్డి నేతలకు అస్సలు ప్రాధాన్యత లభించలేదు.

దీక్షలో అయినా వారు కాసేపు కనిపించారేమో కానీ.. రాష్ట్రపతిని కలిసినప్పుడు మాత్రం ఎవ్వరూ కనిపించలేదు. చంద్రబాబు తన వెంట ఎవరినీ తీసుకు వెళ్లలేదు. రెడ్డి నేతలకు చంద్రబాబు నాయుడు ఎలాంటి ప్రాధాన్యతను ఇవ్వడం లేదని.. అందుకు ఈ పరిణామాలు రుజువు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.