Begin typing your search above and press return to search.
జగన్ కు 20 మినిట్స్ ఎందుకు ఇవ్వలేదు?
By: Tupaki Desk | 24 March 2017 4:47 PM GMTఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగాయో.. టీవీల్లో లైవ్ చూస్తున్న వారంతా చూసేశారు.జరిగిన ఎపిసోడ్ ను సింఫుల్ గా చెప్పాల్సి వస్తే.. అగ్రిగోల్డ్ కు సంబధించిన వారి భూముల్ని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొన్నారన్నది విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాదన. ఈ ఉదంతంపై సింగిల్ జడ్జి విచారణకు ఆదేశించాలన్నది ఆయన డిమాండ్. ఈ విషయాన్ని ఇక్కడ ఆపి.. ఏపీ అధికారపక్షం వాదనను చూస్తే.. జగన్ ఆరోపణలు ఏ మాత్రం నిజం కాదన్నది వారి వాదన.
దీనికి తగ్గట్లే.. జగన్ కానీ తన ఆరోపణలు నిరూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని మంత్రి పత్తిపాటి పుల్లారావు సవాల్ విసిరారు.ఆ మాటకు వస్తే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం.. ప్రత్తిపాటి పుల్లరావు మీద ఆరోపణల్నిరుజువు చేస్తే ఆయన్ను సభకు రానివ్వకుండా చర్యలు తీసుకుంటామని మహా ఉత్సాహంగా సవాలు విసిరారు. ఒకవేళ జగన్ కానీ తన ఆరోపణల్ని నిరూపించలేని పక్షంతో తన పదవికి రాజీనామా చేయాలన్నారు.
ఫైనల్ గా తేల్చిందేమిటంటే.. ఈ ఇష్యూ మీద జగన్ ఎస్.. లేదంటే నో అని మాత్రమే చెప్పాలంటూ ఫర్మానా విధించారు. సమస్యే ఏమిటంటే.. తాము చెప్పదలుచుకున్న విషయానికి ఒకరికి నలుగురు చెప్పేస్తున్న ఏపీ అధికారపక్షం.. తాము వినిపించాలనుకుంటున్న వాదనను వినిపించే అవకాశాన్ని ఏపీ విపక్షానికి ఎందుకు ఇవ్వరన్నది మొదటి ప్రశ్న. జగన్ కు మైకు ఇస్తానని చెబుతూనే.. ఒక్కొక్కరుగా ఏపీ అధికారపక్ష నేతలంతా ఒకరి తర్వాత ఒకరుగా మాట్లాడేశారే కానీ.. విపక్షనేత ఏం చెప్పాలనుకుంటున్నారన్న విషయాన్ని వినే ప్రయత్నం చేయలేదు.
ఆట ఏదైనా.. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకూడదనుకోవటం మామూలే.కానీ.. ధర్మబద్ధంగా ఇవ్వాల్సిన అవకాశాల్నిఇవ్వాలిగా. జగన్ వాదననే తీసుకుంటే.. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొనుగోలు చేసిన భూములపై తన వాదనను వినిపించేందుకు తనకుఒక ఇరవైనిమిషాల సమయం ఇవ్వాలని కోరారు.అదేం పెద్ద సమయం కాదు. వాస్తవానికి ఈ అంశంపై రెండు రోజులుగా అసెంబ్లీలో చర్చ జరుపుతున్నప్పుడు విపక్షనేతకు 20 నిమిషాల సమయం.. కాదంటే మరో పదినిమిషాలు అవకాశం ఇచ్చి..తన వాదనను వినిపించమని చెప్పి ఉంటే.. ఎంత ధర్మబద్ధంగా ఉండేది. తమమాటలు తప్పించి.. వైరిపక్షం మాటల్ని వినేందుకు తాము ఏమాత్రం సిద్ధంగా లేమన్నట్లుగా వ్యవమరించిన అధికారపక్షం తీరును చూస్తే అనిపించేది ఒక్కటే. ఇంతే ఉత్సాహాన్ని.. జగన్ సవాలు విసిరినప్పుటు కూడా ఎందుకు ప్రదర్శించరు అని. న్యాయం.. ధర్మం ఇరువర్గాలకు సమానంగా ఉండాలే కానీ.. తాము చెప్పిందే వేదమన్నట్లుగా మాట్లాడే మాటలు ప్రజాస్వామ్యంలో కుదరదు. జగన్ అడిగిన 20 నిమిషాల సమయం ఇచ్చేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేని వైనాన్ని చూస్తే.. జగన్ కానీ 20నిమిషాల సమయం ఇస్తే.. తమ వాదనలు.. ఉత్సాహం అంతా మటుమాయం అవుతుందని ఏపీ అదికారపక్షం భావించిందా? అన్న సందేహం కలగకమానదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/