Begin typing your search above and press return to search.
చంద్రబాబు వరంగల్ రానట్లేనా?
By: Tupaki Desk | 3 Nov 2015 6:55 AM GMTవరంగల్ ఉప ఎన్నికలను టీడీపీ కంటే బీజేపి నేతలు ఎంతో ప్రతిష్టాత్మకంగానూ , తీసుకుంటున్నారు. వరంగల్ పోరులో పాలక గులాబీ పార్టీకి గట్టి దెబ్బ రుచి చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే అన్ని రకాలుగా ఎన్నికలను ఎదుర్కొనగలిగే సత్తా ఉన్న ఎన్నారైను రంగంలోకి దించారు.
అయితే.. బీజేపీకి టీడీపీ మద్దతు ఇస్తున్నప్పటికీ ఇక్కడి బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారానికి టీడీపీ అధినేత, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తారా రారా అన్నది ఆసక్తికరంగా మారింది. కొద్ది రోజుల కిందటవరకు ఉన్న పరిస్థితుల ప్రకారమైతే చంద్రబాబు వెళ్లి వరంగల్ ప్రచారం చేయడంపై అనుమానమే ఉండేది కాదు. కానీ, ఇటీవల మారిన పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు రావడానికి అవకాశాలు లేవని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమరావతి శంకుస్థాపన నాటి నుంచి ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండటంతో ఎన్నికల కోసం కేసీఆర్పై చంద్రబాబు విమర్శలు గుప్పిస్తారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి . ఎలాగు ఓడిపోయే స్దానంలో ప్రచారం నిర్వహించడం ఎందుకని.. దీనికి బదులు పార్టీకి మంచి పట్టున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించినా ఫలితం ఉంటుందని కొందరు నాయకులు చంద్రబాబుకు సూచించిన్నట్లు సమాచారం . అయితే బీజేపి నేతలు ఒత్తిడి చేస్తే మాత్రం చంద్రబాబు వరంగల్ లో ప్రచారానికి రాక తప్పదు.
మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ చంద్రబాబు ప్రచారం చేసినా ఫలితం బీజేపీకి అనుకూలంగా వస్తుందన్న నమ్మకం లేదు. దీంతో తాను అనవసరంగా అక్కడ ప్రచారం చేసి ప్రభావం చూపించలేదు అనిపించుకోవడం కంటే కామ్ గా ఉండడమే బెటరని చంద్రబాబు అనుకుంటున్నారట. మరోవైపు టీ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా టీడీపీతో చాలాకాలంగా అంటీముట్టనట్లుగానే ఉంటుండడంతో అసలు చంద్రబాబును ప్రచారానికి ఆహ్వానించకపోయినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.