Begin typing your search above and press return to search.
బాబును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రెండు కళ్ల సిద్దాంతం?
By: Tupaki Desk | 24 Dec 2019 6:46 AM GMTమెరుపులా వ్యవహరించాలి. చప్పున నిర్ణయం తీసుకోవాలి. విషయం ఏదైనా క్లారిటీగా ఉండాలే కానీ కన్ఫ్యూజన్ అస్సలు పనికి రాదు. కానీ.. టీడీపీ అధినేత చంద్రబాబులో ఇలాంటి లక్షణాలేవీ కనిపించవు. సమస్య ఏదైనా నాన్చటం.. ఒక నిర్ణయానికి రావటం.. విషయాల్ని తేల్చేయటం లాంటివి అస్సలు చేయరు.
ఆయనకు అన్ని కావాలి. ఏ చిన్ననష్టానికి ఇష్టపడరు. సింఫుల్ గా చెప్పాలంటే అవ్వా కావాలి.. బువ్వా కావాలి. కొన్ని సందర్భాల్లో కొన్ని అంశాల విషయంలో ఇలాంటివి సాధ్యం కావు. కానీ.. ఆయన మాత్రం అందుకు సిద్ధంగా ఉండరు. ఎక్కడదాకానో ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీ ప్రయోజనాల కోసం పోరాడితే.. తెలంగాణలో అవకాశం ఉండదన్న విషయాన్ని గుర్తించిన వైఎస్ జగన్.. పార్టీ తెలంగాణ శాఖను అలా ఆపేశారు. కానీ.. చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించి బొక్కబోర్లా పడటమే కాదు.. వరుస అవమానాల్ని ఎదుర్కొంటున్న పరిస్థితి.
ఒకప్పుడు తనను కీర్తించిన నేతల చేత సైతం తిట్టించుకునే వరకూ ఆయన ఇమేజ్ ను పాడు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న వేళ.. ఏపీ ప్రయోజనాల్ని దెబ్బ తీస్తూ.. తెలంగాణకు అనుకూలంగా లేఖ రాయటమే విభజనకు కారణంగా మారింది. టీడీపీ లేఖ ఇచ్చిన తర్వాత మాత్రమే కాంగ్రెస్ ఈ అంశాన్ని సీరియస్ గా పరిగణించటాన్ని మర్చిపోలేం.
ఓవైపు ఏపీ ప్రయోజనాల్ని దెబ్బ తీస్తూ లేఖ ఇచ్చిన చంద్రబాబు.. మరోవైపు రెండు రాష్ట్రాలు తనకు రెండు కళ్లుగా అభివర్ణిస్తూ.. రెండు ప్రాంతాల ప్రయోజనాలు దెబ్బ తినకుండా ఉండేలా తాను ప్రయత్నిస్తానని చెబుతూ రెండు కళ్ల సిద్ధాంతాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. కాలక్రమంలో అదెంత కామెడీ సిద్ధాంతంగా మారింతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అప్పటి రెండు కళ్ల సిద్ధాంతం ఇప్పుడు బాబుకు మరోసారి ఎదురయ్యే పరిస్థితి. బాబుకుండే సందిగ్థత మీద క్లారిటీ ఉన్న ముఖ్యమంత్రి జగన్.. ఏపీ రాజధాని విషయంలో తీసుకున్న నిర్ణయంతో బాబు ఏటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో చిక్కుకుపోయారని చెప్పాలి. తన కలల పంటగా చెప్పే అమరావతి స్థానే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖగా జగన్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నవేళ.. దానికి వ్యతిరేకంగా మాట్లాడలేరు.
ఒకవేళ మాట్లాడితే విశాఖతో పాటు ఉత్తరాంధ్రలోని మరో రెండు జిల్లాల్లోనూ టీడీపీకి పుట్టగతులు ఉండని పరిస్థితి. అలా అని విశాఖను సమర్థిస్తే.. రాజధాని ప్రాంతంలో ఆయన్ను ఛీ కొట్టటం ఖాయం. తెలంగాణ విషయంలో తెర మీదకు తీసుకొచ్చిన రెండు కళ్ల సిద్ధాంతం బాబుకురాజకీయంగా భారీ డ్యామేజ్ చేసిందని చెప్పాలి. తాజాగా రాజధాని విషయంలోనూ బాబుకు రెండు కళ్ల సిద్ధాంతం చేదు అనుభవాన్ని మిగల్చటం ఖాయమని చెప్పక తప్పదు.