Begin typing your search above and press return to search.
అయ్యన్నపై గంటా ఫైర్ వెనుక స్కెచ్ వేరే!
By: Tupaki Desk | 15 Jun 2017 6:40 AM GMTక్రమశిక్షణ గల పార్టీగా పేరున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులను నడిపిస్తున్న నాయకుడైన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరువు పలుచన పడే పరిణామం ఇది. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేకెత్తిస్తున్న విశాఖలో వేలకోట్ల భూ కబ్జా స్కాంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - పార్టీ పరువు మంట కలిసిందని తెలుగుదేశం శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి. బాధితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోయిందని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. కనీసం సిఐడీ విచారణకు కూడా ప్రభుత్వం సాహసించకపోవడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగేలా ఇలాంటి వివాదాలు వెలుగులోకి వచ్చినప్పుడు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. కానీ అలా జరగలేదు. అంతకు మించి కేబినెట్ మంత్రుల మధ్యే విభేదాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. భూముల కుంభకోణంపై మంత్రి అయ్యన్న వ్యవహరించిన తీరును తప్పుపడుతూ మరో మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి లేఖ రాయడం సంచలనం సృష్టించింది. మరోవైపు కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ లేఖాస్త్రం బయటపడిందన్న ప్రచారం కూడా జరుగుతుండటం ఆసక్తికరం.
విశాఖ భూస్కాంపై మంత్రి అయ్యన్నపాత్రుడు నిరాధార వ్యాఖ్యలు చేస్తూ, పార్టీ పరువు తీస్తున్నారంటూ గంటా లేఖ రాయడం గమనార్హం. ఈ నెల 9నే తన లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబుకు గంటా పంపించారు. అందులోనూ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం విశాఖకు రావటానికి ముందే గంటా రాసిన లేఖను ఆయన అనుచరులు విశాఖలో మీడియాకు అందచేశారు. తద్వారా ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో కలకలం రేకెత్తించారు. విశాఖ భూముల కుంభకోణం మంత్రుల మధ్య చిచ్చు రగిల్చి ఏకంగా లేఖలు రాసుకునే స్థాయికి చేరినప్పటికీ సీఎం చంద్రబాబు రియాక్ట్ కాకపోవడం గమనార్హం. కేబినెట్ మంత్రులు రోడ్డెక్కినప్పటికీ క్రమశిక్షణ గల పార్టీ రథసారథిగా బాబు ఎందుకు రియాక్ట్ అవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
కాగా విశాఖకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలైన మంత్రి గంటా - అయ్యన్న మధ్య ఎప్పటి నుంచో అంతర్గత యుద్ధం నడుస్తోంది. కేవలం అయ్యన్నతో విభేదించే, గంటా శ్రీనివాసరావు 2009ఎన్నికలకు ముందు టీడీపీని వీడి, ప్రజారాజ్యంలో చేరారు. పార్టీలు వేరైనప్పటికీ, వీరిద్దరి మధ్య విభేదాలు కొనసాగుతునే ఉన్నాయి. 2014ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు చంద్రబాబు సమక్షంలో మళ్లీ టీడీపీలో చేరారు. గంటాను తిరిగి పార్టీలోకి తీసుకోవడాన్ని అయ్యన్నపాత్రుడు వేలాది ముందు తప్పుపట్టారు. ఈ విషయంలో చంద్రబాబు నిర్ణయాన్ని కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు - ఆక్రమాలకు పాల్పడుతున్నారంటూ అయ్యన్న గంటాపై పరోక్ష విమర్శలు చేస్తునే ఉన్నారు. అయ్యన్న వ్యాఖ్యలపై గంటా ఏనాడూ ప్రతిస్పందించలేదు. ఆయనపై బహిరంగ విమర్శలకు దిగలేదు. ఇప్పుడు విశాఖ భూముల కుంభకోణంలో గంటాను దృష్టిలో పెట్టుకునే అయ్యన్న వ్యాఖ్యలు చేశారు. సుమారు 15రోజుల నుంచి ఈ వ్యవహారం నడుస్తున్నా, పెద్దగా పట్టించుకోని గంటా - అయ్యన్నపై ఫిర్యాదు చేస్తూ సీఎంకు లేఖ రాయడం సంచలనమైంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/